చింతమనేనిపై 50 కేసులు.. గాలిస్తోన్న పోలీసులు..!

0 cases slapped on chintamaneni police on the lookout for absconding tdp leader, చింతమనేనిపై 50 కేసులు.. గాలిస్తోన్న పోలీసులు..!" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/chintamaneni-prabhakar.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/chintamaneni-prabhakar-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/chintamaneni-prabhakar-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/chintamaneni-prabhakar-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన ఎట్రాసిటీ కేసు మరో మలుపు తిరిగింది. జోసఫ్‌ అనే వ్యక్తిని చింతమనేని కులం పేరుతో దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు.. ఫిర్యాదు దారుడు, గ్రామస్తులతో మాట్లాడిన ఆడియో సంభాషణను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజును కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలను ఆయనకు అందజేశారు.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం పెదవేగి మండలం పినకడిమిలో ఆదాం అనే వ్యక్తి పొలంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను అటుగా వెళ్తున్న గద్దె కిశోర్‌ అనే వ్యక్తి అడ్డుకున్నారు. వారిలో కొందరిని పంపేసి, ఇద్దరి దగ్గర ఉన్న పారలు లాగేసుకున్నారు. విషయాన్ని ఆదాం నుంచి భూమి లీజుకు తీసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెప్పడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఇసుక తవ్వుకుని వెళుతున్న వ్యక్తులను చింతమనేని ప్రభాకర్‌, గద్దె కిషోర్‌ కులం పేరుతో దూషించారని పెదవేగి పోలీస్టేషన్‌లో జోసఫ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇసుక కొరతపై ఆందోళనకు దిగిన చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అంతేగాక.. చింతమనేనిపై ఇప్పటివరకూ 50 కేసులు నమోదైనట్టు వెస్ట్‌ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్‌ తెలిపారు. చింతమనేనిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టలేదని.. ఇద్దరి ఎస్‌ఐలతో చింతమనేని దురుసుగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయని.. ఇతరుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయే కానీ.. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టలేదని ఎస్పీ తెలిపారు. చింతమనేని కోసం పలు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు ఎస్పీ నవదీప్ సింగ్.

కాగా… ఈ రగడపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని.. విపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులపై, మాజీ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కూడా అక్రమ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. జరిగిన వివాదంలో ఆయన ప్రమేయం లేకున్నా, కనీసం కేసు నమోదు చేసిన బాధితుడు కూడా అక్కడ లేకపోడని చెబుతున్నారు టీడీపీ నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *