గుజరాత్‌లో గ్యాస్ లీక్‌.. నలుగురు మృతి..

గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కెమికల్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తున్న నలుగురు కార్మికులు విషవాయువులకు బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ జిల్లాలోని ధోలీ గ్రామంలో గ్యాస్ లీక్ ఘటన..

గుజరాత్‌లో గ్యాస్ లీక్‌.. నలుగురు మృతి..
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 7:18 AM

గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కెమికల్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తున్న నలుగురు కార్మికులు విషవాయువులకు బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ జిల్లాలోని ధోలీ గ్రామంలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. సిమెజ్ సమీపంలో ఉన్న చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓ కెమికల్ వెస్ట్ ట్యాంక్‌ను నలుగురు కార్మికులు శుభ్రం చేస్తున్నారు. అయితే అదే సమయంలో అందులో విషవాయువులు లీకయ్యాయి. దీంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ నితీష్ పాండే తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Four labourers were cleaning a chemical waste tank. They died after inhaling poisonous gas released from the chemical waste. The process to register the FIR is underway: Deputy Superintendent of Police Nitesh Pandey. #Gujarat https://t.co/KHgjpbZgTH

— ANI (@ANI) July 18, 2020