తమిళనాడులో 25 మంది జర్నలిస్టులకు కరోనా.. బాధితులంతా..

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో పనిచేసే వారిలో దాదాపు 25 మందికి కరోనా సోకినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఛానెల్‌లో పనిచేస్తున్న ఓ జర్నలిస్టుకు కరోనా రావడంతో.. ఛానెల్‌లో ఉన్న 94 మందికి కరోనా టెస్టులు జరపగా.. 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా బారినపడ్డ జర్నలిస్టులందర్నీ ఒమదురర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాలని ప్రభుత్వం […]

తమిళనాడులో 25 మంది జర్నలిస్టులకు కరోనా.. బాధితులంతా..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 8:50 PM

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో పనిచేసే వారిలో దాదాపు 25 మందికి కరోనా సోకినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఛానెల్‌లో పనిచేస్తున్న ఓ జర్నలిస్టుకు కరోనా రావడంతో.. ఛానెల్‌లో ఉన్న 94 మందికి కరోనా టెస్టులు జరపగా.. 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా బారినపడ్డ జర్నలిస్టులందర్నీ ఒమదురర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ముంబైలో కూడా 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులకు కరోనా సోకుతుండటం దురదృష్టకరమని.. జర్నలిస్ట్‌లంతా విధుల్లో ఉన్నప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఫేస్‌ మాస్క్‌లు, సోషల్ డిస్టెన్స్‌ పాటించాలని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.