చంద్రయాన్-2…. 20 గంటల కౌంట్ డౌన్ షురూ !

చంద్రయాన్-2 మిషన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రారంభం గల ఈ మిషన్ కి సంబంధించి ఆదివారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. ఈ మిషన్ ద్వారా చంద్రునిపై రోబోటిక్ రోవర్ ని అడుగు పెట్టించాలన్నది మన ధ్యేయం. ఈ ప్రయోగంలో కక్ష్యలోకి అతి బరువైన రాకెట్ లాంచర్ ‘ జీ ఎస్ ఎల్వీ ..ఎంకే.-3 ‘ ని చంద్రునిపైకి […]

చంద్రయాన్-2.... 20 గంటల కౌంట్ డౌన్ షురూ !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 14, 2019 | 1:16 PM

చంద్రయాన్-2 మిషన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రారంభం గల ఈ మిషన్ కి సంబంధించి ఆదివారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. ఈ మిషన్ ద్వారా చంద్రునిపై రోబోటిక్ రోవర్ ని అడుగు పెట్టించాలన్నది మన ధ్యేయం. ఈ ప్రయోగంలో కక్ష్యలోకి అతి బరువైన రాకెట్ లాంచర్ ‘ జీ ఎస్ ఎల్వీ ..ఎంకే.-3 ‘ ని చంద్రునిపైకి ప్రయోగిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని మొత్తం కాల వ్యవధి ఏడాదిపాటని వారు పేర్కొన్నారు. 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించి దాదాపు రెండు నెలల అనంతరం ఈ రాకెట్ లాంచర్ చంద్రుని సౌత్ పోల్ సమీపంలో దిగుతుందని వారు వివరించారు. 640 టన్నుల రాకెట్ లాంచర్ అయిన దీన్ని ‘ బాహుబలి ‘గా అభివర్ణిస్తున్నారు. 15 అంతస్థుల బిల్డింగ్ అంతటి పొడవైన ఈ లాంచర్.. 3.8 టన్నుల బరువైన ఉపగ్రహాన్ని చంద్రునిపైకి మోసుకుపోతుంది. భారత దేశం ప్రయోగిస్తున్న అతి బరువైన లాంచర్లలో ఇది మూడవది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిలకించనున్నారు. స్పేస్ పోర్ట్ నుంచి లైవ్ లాంచ్ ని చూసే మూడవ రాష్ట్రపతి కానున్నారు ఆయన.. దాదాపు రూ. 1,000 కోట్లతో చేపడుతున్న చంద్రయాన్-2 మిషన్ లో 1.4 టన్నుల విక్రమ్ లాండర్ కూడా ఓ భాగం. ఇది 27 కిలోల బరువైన ‘ ప్రగ్యాన్ ‘ రోవర్ ని మోసుకుపోతుంది. చంద్రుని సౌత్ పోల్ పై రెండు లోతైన ప్రదేశాల మధ్య ఈ రోవర్ దిగనుంది. ఈ రోవర్ చేసే 15 నిముషాల పని ‘ టెరిఫయింగ్ మూమెంట్స్ ‘ అని ఇస్రో చీఫ్ కె. శివన్ అభివర్ణించారు.ఇలాంటి క్లిష్టమైన పనిని తాము ఇదివరకెన్నడూ చేపట్టలేదన్నారు. ఈ ప్రయోగంలో ఇండియా సక్సెస్ అయితే.. ల్యూనార్ సర్ ఫేస్ పై తమ ఉపగ్రహాలను అడుగుపెట్టించడంలో విజయం సాధించిన నాలుగో దేశంగా అవతరిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇజ్రాయెల్ ఇలాంటి ప్రయోగం చేసి విఫలమైంది.

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..