షాకింగ్.. ఓడలో 3700 మంది.. 174 మందికి కరోనా.. మన ఇండియన్స్‌కి కూడా..

కరోనా వైరస్ పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలో పురుడు పోసుకున్న ఈ రాకాసి వైరస్.. క్రమేపీ ఇతర దేశాలను కూడా తాకుతోంది. జపాన్‌లోని జపాన్‌లోని యొకొహమా పోర్టులో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ ఓడలో ఉన్న వారిపై కూడా కరోనా పంజా విసిరింది. జపాన్‌కు చెందిన విహార నౌక “డైమండ్ ప్రిన్సెస్‌”లో నుంచి హాంగ్‌కాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. దీంతో ఫిబ్రవరి 3 నుంచి ఆ షిప్‌ను యొకొహమా […]

షాకింగ్.. ఓడలో 3700 మంది.. 174 మందికి కరోనా.. మన ఇండియన్స్‌కి కూడా..
Follow us

| Edited By:

Updated on: Feb 12, 2020 | 11:07 PM

కరోనా వైరస్ పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలో పురుడు పోసుకున్న ఈ రాకాసి వైరస్.. క్రమేపీ ఇతర దేశాలను కూడా తాకుతోంది. జపాన్‌లోని జపాన్‌లోని యొకొహమా పోర్టులో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ ఓడలో ఉన్న వారిపై కూడా కరోనా పంజా విసిరింది. జపాన్‌కు చెందిన విహార నౌక “డైమండ్ ప్రిన్సెస్‌”లో నుంచి హాంగ్‌కాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. దీంతో ఫిబ్రవరి 3 నుంచి ఆ షిప్‌ను యొకొహమా పోర్ట్‌లోనే నిలిపేశారు. దీంట్లో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 138 మంది భారతీయ ప్రయాణికులు, సిబ్బంది కూడా ఉన్నారు.

అయితే ఇందులో ఇద్దరు భారతీయులు కొవిడ్-19 (కరోనా వైరస్) బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. షిప్‌లో ఉన్న భారతీయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటి వరకు ఓడలో ఉన్న 3700 మందిలో 174 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. మరో వారం వరకు (ఫిబ్రవరి 19) షిప్‌లో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటికే షిప్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న మన దేశస్థుడు వినయ్‌ కుమార్‌ సహా మరో యువతి తమను రక్షించాలంటూ.. సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో