వంశీ ఎన్నిక చెల్లదు..హైకోర్టుకు యార్లగడ్డ వెంకట్రావు

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీ షాకిచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టులో  పిటీషన్ వేశారు. ఇప్పటికే పీకల్లోతు కష్టల్లో ఉన్న టీడీపీకి.. వైసీపీ నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు బీజేపీలోకి జంప్ అవుతారో అని పార్టీ అధిష్టానం టెన్షన్‌గా ఉంది.

ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు కోర్టులో  పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడుపై అనర్హత వేటు వెయ్యాలని , వారి ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, వల్లభనేని వంశీకి కూడా ఇలాంటి షాక్ ఇచ్చారు వైసీపీ నేత వెంకటరావు . గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ  స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *