కొత్త బిచ్చగాడిలా హడావుడి చేస్తున్నాడు : కన్నబాబు

హైదరాబాద్‌లో కాపురం పెట్టి చంద్రబాబు, లోకేష్ ఏపీపై పెత్తనం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. 8 నెలలుగా కనిపించని తండ్రీ కొడుకుల్లో లోకేష్‌ ఇప్పుడొచ్చి కొత్త బిచ్చగాడి మాదిరి హడావుడి చేస్తున్నారన్నారు. ఆయనకు చంద్రబాబు కొడుకు అన్న హోదా తప్ప ఏముందని మంత్రి ప్రశ్నించారు. లోకేష్‌ మొదటిసారి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టున్నాడని, అందుకే ఆయనకు వర్షాలకు, వరదలకూ తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌ చేత చెప్పించుకునే […]

  • Venkata Narayana
  • Publish Date - 11:26 am, Sat, 24 October 20

హైదరాబాద్‌లో కాపురం పెట్టి చంద్రబాబు, లోకేష్ ఏపీపై పెత్తనం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. 8 నెలలుగా కనిపించని తండ్రీ కొడుకుల్లో లోకేష్‌ ఇప్పుడొచ్చి కొత్త బిచ్చగాడి మాదిరి హడావుడి చేస్తున్నారన్నారు. ఆయనకు చంద్రబాబు కొడుకు అన్న హోదా తప్ప ఏముందని మంత్రి ప్రశ్నించారు. లోకేష్‌ మొదటిసారి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టున్నాడని, అందుకే ఆయనకు వర్షాలకు, వరదలకూ తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌ చేత చెప్పించుకునే దుస్థితిలో తమ ప్రభుత్వం లేదన్నారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఘాటు విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం కార్పొరేషన్లకు పాలకవర్గాలను ప్రకటించగానే చంద్రబాబు బీసీలకు అధ్యక్ష పదవి, పొలిట్‌ బ్యూరో సభ్యుల పదవులు ఇచ్చారన్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరిని అనుసరిస్తున్నారో అర్థమవుతోందని కన్నబాబు ఎద్దేవా చేస్తూ.. తాను పర్యటించడం వల్లే జగన్ ప్రభుత్వం స్పందిస్తోందన్న లోకేష్ కామెంట్లకు కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు.