యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

జగద్రక్షుని తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. రేపు ప్రారంభం కానున్న బ్రహోత్సవాలు.. 11 రోజుల పాట జరగనున్నాయి. 15వ తేదీన తిరుకళ్యాణం నిర్వహిస్తారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకూ బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో అంత్యంత విశేషమైన ఎదుర్కోలు, తిరు కళ్యాణం, దివ్య విమాన రథోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. స్వామి వారి కళ్యాణానికి ప్రభుత్వం […]

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 11:40 AM

జగద్రక్షుని తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. రేపు ప్రారంభం కానున్న బ్రహోత్సవాలు.. 11 రోజుల పాట జరగనున్నాయి. 15వ తేదీన తిరుకళ్యాణం నిర్వహిస్తారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకూ బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో అంత్యంత విశేషమైన ఎదుర్కోలు, తిరు కళ్యాణం, దివ్య విమాన రథోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. స్వామి వారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం కేసీఆర్.

స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. టీటీడీ తరపున ఆలయ అధికారులు స్వామి వారికి వస్త్రాలు సమర్పిస్తారు. ఆలయ విస్తరణ నేపథ్యంలో స్థలభావంతో కళ్యాణం ఉదయం బాల ఆలయంలో నిర్వహిస్తున్నప్పటికీ.. సాయంత్రం కొండ కింద.. హైస్కూల్ గ్రౌండ్‌లో కళ్యాణం నిర్వహిస్తారు.