యువతలో బాడీ బిల్డింగ్ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. దానికోసం జిమ్, డైట్ అన్నీ చేస్తారు. అయితే బాడీ బిల్డర్ అయిన 90ఏళ్ల తాత ఎలా ఉంటాడో మీరెప్పుడైనా చూసారా? అతను ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్సు గల బాడీ బిల్డర్, అతనికి 90 ఏళ్లు. కానీ, ఇప్పటికీ తను 18 ఏళ్ల వయస్సు కుర్రాడిలా బాడీ బిల్డ్ చేస్తున్నాడు. పురాతన బాడీబిల్డర్ జిమ్ అరింగ్టన్. అమెరికా నుంచి వచ్చిన ఈయన ఇంత పెద్ద వయసులో కూడా ఉత్సాహంగా బాడీబిల్డింగ్ చేస్తుంటాడు. 83 సంవత్సరాల వయస్సులో, అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీ బిల్డర్ అయ్యాడు.
అతను13 సంవత్సరాల వయస్సులో బాడీబిల్డింగ్‌లో తన వృత్తిని ప్రారంభించాడు. బాడీబిల్డింగ్ మ్యాగజైన్ పోస్టర్ చూసి బాడీ బిల్డర్ కావాలని డిసైడ్ అయ్యాడట. ఇక అలా మొదలైన తన ప్రయత్నం ఇప్పటికీ ఆపలేదు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జిమ్ ఆరింగ్టన్ ముత్తాత 2015 లో తన 83 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్‌గా రికార్డు సాధించారు.
90 ఏళ్ల వయస్సులో కూడా ఇప్పటికీ జిమ్ చేస్తాడు. వేగంగా పరిగెడుతూ బాడీబిల్డింగ్ పోటీలలో గెలుస్తాడు. అతని విజయాల జాబితా కూడా పెరిగిపోతుంది. నెవాడాలోని రెనోలో ఇటీవల జరిగిన IFBB ప్రొఫెషనల్ లీగ్ ఈవెంట్‌లో, జిమ్ 70+ విభాగంలో 3వ స్థానంలో, 80+ కేటగిరీలో 1వ స్థానంలో నిలిచాడు.
ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..