డేంజర్‌ లెవల్‌కు మిడిలీస్ట్ వార్.. సంక్షోభంలో అగ్రరాజ్యం.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ!

మిడిల్ ఈస్ట్‌ మంటలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది..! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదురోజుల బ్రేక్ అని హడావుడి చేశారు కానీ.. ఎలాంటి ఫలితం లేదు. రాను రాను ప్రాంతీయ యుద్ధంగా మారినా ఆశ్చర్యంలేదంటున్నారు విశ్లేషకులు. అంతటి డేంజర్ జోన్‌లో ఉంది మిడిలీస్ట్. మరీ యుద్ధంతో అమెరికాకు ఒరిగిందేంటి..? ఇజ్రాయెల్‌తో కలిసి నడవడం వల్ల అగ్రరాజ్యానికి కలిగిన లాభమేంటి..? ట్రంప్ నిర్ణయాలపై అమెరికన్ల రియాక్షన్ ఎలా ఉంది..?

డేంజర్‌ లెవల్‌కు మిడిలీస్ట్ వార్.. సంక్షోభంలో అగ్రరాజ్యం.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ!
Passengers In Washington Airport

Updated on: Mar 26, 2026 | 8:40 AM

ఇరాన్-ఇజ్రాయెల్ వార్ డేంజర్‌ లెవల్‌కి వెళ్లింది. డైరెక్ట్‌గానే ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకునే స్థాయికి చేరుకుంది. మిసైల్ స్ట్రైక్స్, డ్రోన్ అటాక్స్‌తో పరస్పరం విరుచుకుపడుతున్నారు. మరోవైపు అమెరికా మిడిలీస్ట్ వార్‌లో పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. బయటకు ట్రంప్ శాంతి వచనాలు పలికిస్తున్నా.. గ్రౌండ్‌లో మాత్రం అమెరికా మిలిటరీ బలగాలను మరింత మోహరిస్తోంది. గల్ఫ్‌లో అదనపు నేవల్ ఫోర్సెస్.. అలర్ట్ లెవెల్స్ పెంచింది. ఇటు ఇజ్రాయెల్ – అమెరికా మాట వినే పరిస్థితి కనిపించడంలేదు. తమ సెక్యూరిటీని తామే డిసైడ్ చేసుకుంటాం అనే లెవల్‌కు వెళ్లింది. అమెరికా సపోర్ట్ ఉన్నా.. ఫైనల్ కాల్ ఇజ్రాయెల్‌దే. ఇటు ఇరాన్ కూడా సైలెంట్‌గా ఏంలేదు. ఎవరైనా అటాక్ చేస్తే రిప్లై డబుల్‌ స్ట్రాంగ్‌గా ఉంటోంది. దీంతో యాక్షన్‌కు రియాక్షన్‌తో సిట్యుయేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. అటు యుద్ధ ప్రభావంతో అమెరికాలోని పలు వ్యవస్థలు గాడి తప్పడం టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా మారింది.

యుద్ధంతో జీతాలు డిలే కావడం వల్ల ప్రపంచానికి సెక్యూరిటీ మోడల్‌గా చెప్పుకునే అమెరికాలోనే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ సిస్టమ్ పూర్తిగా కుదేలైంది. మొన్న ఒక్కరోజే 3,450 మందికి పైగా TSA స్టాఫ్ డుమ్మా కొట్టింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 12% మంది ఒకేసారి లీవ్ పెట్టారు. ఫలితంగా అమెరికా దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ చెక్‌లో ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం తాత్కాలికంగా మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ పరిస్థితి అదుపులోకి రావడంలేదు. అదనపు సపోర్ట్, లైన్ మేనేజ్‌మెంట్.. ఇలా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నా.. పరిస్థితి ఫుల్ కంట్రోల్‌లోకి రావడం లేదు. ఇది త్వరగా సాల్వ్ కాకపోతే గ్లోబల్ ట్రావెల్‌పై కూడా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది.

అమెరికా ఎకానమీకి కూడా రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తోంది. ఇలానే షట్‌డౌన్ కొనసాగితే ప్రతి వారం దాదాపు 2 నుంచి 3 బిలియన్ డాలర్ల జీడీపీ లాస్ అవుతుందంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల ఫెడరల్ ఉద్యోగులు డైరెక్ట్‌గా ప్రభావితమవుతారు. మరోవైపు నేషనల్ పార్క్స్, మ్యూజియంలు మూతపడ్డాయి. టూరిజం రంగానికి రోజుకు 20 – 30 మిలియన్ డాలర్ల వరకు నష్టం వస్తోంది. వ్యాపారాల్లో చెల్లింపులు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లో కూడా తగ్గింది.

ఇవే కాదు అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ అనిశ్చితి పెరిగి, ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది. ఇప్పటికే పశ్చిమాసియా వార్‌ మూలంగా అమెరికా పరపతి తగ్గిపోయింది. అంతర్జాతీయంగా అమెరికా మాటను వినే పరిస్థితుల్లో ప్రపంచదేశాలు కాదు, కనీసం మిత్రదేశాలు కూడా వినడంలేదు. దీంతో అమెరికా తన పరువును తానే గ్లోబల్‌ వీధుల్లో పోగొట్టుకుందని స్వదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మొత్తంగా.. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఈ సంక్షోభం పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధమేనని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. మిత్రదేశాలతో సంప్రదింపులు జరపకపోవడం వల్ల అమెరికా ఈ సంక్షోభంలో ఒంటరయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పట్లో ఆగేలా కనిపించని ఈ యుద్ధం అమెరికాని ఇంకెంత దెబ్బతీస్తోందో చూడాలి..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us