India-Pakistan: భారత్-పాక్‌ ఉద్రిక్తతలు.. కేంద్రమంత్రి జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. ఏం మాట్లాడరంటే?

భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. భారత్-పాక్ మధ్య పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతకుముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు కూడా ఆయన ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని..ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలుస్తోంది.

India-Pakistan: భారత్-పాక్‌ ఉద్రిక్తతలు.. కేంద్రమంత్రి జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. ఏం మాట్లాడరంటే?
U.s. Secretary

Updated on: May 10, 2025 | 1:03 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాక్ ప్రతీకార చర్యగా భారత్‌లో సరిహద్దులోని నగరాలపై డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో దాడులకు ప్రయత్నించింది. పాక్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్.. పాక్‌కు బుద్ది చెప్పే విధంగా వారి దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తారాస్థాయికి చేరాయి.

ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. భారత్-పాక్ మధ్య పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతకుముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు కూడా ఆయన ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని..ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఇరు దేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామని రూబియో అన్నారు.

మరోవైపు ఇటీవలే భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఆమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ యుద్దంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పారు. ఇరు దేశాలకు తాము చేసే సహాయం ఏదైనా ఉందంటే భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు సహకరించడమేనని ఆయన అన్నారు. ఈ పరిస్థితులు సద్దుమణగాలంటే ఒకైన మార్గం చర్చలేనని ఆయన తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..