US Accident: టెక్సాస్‌లో వలసదారులతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తా.. పది మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

|

Aug 05, 2021 | 9:24 AM

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లో వలసదారులతో వెళ్తున్న ఓ వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో 10మంది మృతి.

US Accident: టెక్సాస్‌లో వలసదారులతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తా.. పది మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Van Crashes In South Texas
Follow us on

Van crashes in South Texas: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లో వలసదారులతో వెళ్తున్న ఓ వ్యాన్‌ బోల్తా పడింది. అతి వేగంతో దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఫల్టీలు కొట్టింది. ఈ ఘటనలో 10మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

దక్షిణ టెక్సాస్‌లో బుధవారం సుమారు 30 మందితో వెళ్తున్న వ్యాన్ ఢీకొనడంతో పది మంది మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. యుఎస్ రూట్ 281​లో వ్యాన్ చాలా వేగంగా ప్రయాణించిందని, అది మలుపు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మెటల్ యుటిలిటీ పోల్, డిపిఎస్ సార్జంట్‌లోకి దూసుకెళ్లిందని అధికారులు పేర్కొన్నారు. వ్యాన్ సామర్థ్యం 15 మంది కాగా, అంతకు మించి ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  Blackmail : ‘ఆస్తి రాసిస్తావా? లేక పోలీసులకు ఫిర్యాదు చేయమంటావా?’.. కామారెడ్డి జిల్లాలో మహిళ అరాచకాలు..!