అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు షాక్.. పౌరసత్వం, గ్రీన్ కార్డ్ ఖర్చులు భారీగా పెంపు!

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను మరింత ఖరీదుగా మార్చే కొత్త నిబంధనలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ పౌరసత్వం పొందాలని ఆశిస్తున్న లక్షలాది మంది వలసదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు షాక్.. పౌరసత్వం, గ్రీన్ కార్డ్ ఖర్చులు భారీగా పెంపు!
Us Green Card Visa

Updated on: Jun 23, 2026 | 3:57 PM

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను మరింత ఖరీదుగా మార్చే కొత్త నిబంధనలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ పౌరసత్వం పొందాలని ఆశిస్తున్న లక్షలాది మంది వలసదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, అమెరికా పౌరసత్వం కోసం దాఖలు చేసే ఫారం N-400 రుసుము భారీగా పెరగనుంది. ప్రస్తుతం కాగితంపై దాఖలు చేసే దరఖాస్తుకు 760 డాలర్లు వసూలు చేస్తుండగా, దాన్ని 1,330 డాలర్లకు పెంచాలని DHS ప్రతిపాదించింది. అంటే దాదాపు 75 శాతం పెరుగుదల. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము 710 డాలర్ల నుంచి 1,280 డాలర్లకు పెరగనుంది. ఇది 80 శాతం వరకు పెరుగుదలగా చెప్పవచ్చు.

అయితే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు కొంత ఉపశమనం కల్పించారు. ఫెడరల్ పేదరిక ప్రమాణాల ప్రకారం 400 శాతం కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం అమల్లో ఉన్న 380 డాలర్ల తగ్గింపు రుసుమును కొనసాగించాలని ప్రతిపాదించారు. కానీ పూర్తిస్థాయి రుసుము మినహాయింపు అవకాశాన్ని తొలగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించేందుకు 60 రోజుల గడువు ఇవ్వబడింది. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయినప్పటికీ, ఈ మార్పులు అమల్లోకి వస్తే అమెరికాలో స్థిరపడాలనుకునే వలసదారులపై ఆర్థిక భారం గణనీయంగా పెరగనుంది.

అమెరికాలో భారతీయుల సంఖ్య ప్రస్తుతం 60 లక్షలకు పైగా ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, అందులో 37 లక్షలకుపైగా భారతీయ సంతతి వ్యక్తులు ఉండగా, 23 లక్షలకు పైగా ప్రవాస భారతీయులు (NRI) ఉన్నారు. 2024లో సుమారు 66,800 మంది భారతీయులు గ్రీన్ కార్డులు పొందారు. అయితే ఇది 2022తో పోలిస్తే గణనీయంగా తగ్గిన సంఖ్య. ఇప్పటికే హెచ్-1బీ వీసా విధానాల్లో మార్పులు, కఠిన నిబంధనలతో భారతీయ ఐటీ నిపుణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పౌరసత్వం, గ్రీన్ కార్డ్ దరఖాస్తు రుసుములు పెరిగితే అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us