Donald Trump: ఇరాన్‌తో ఒప్పందం విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం!

ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వైట్‌ హౌస్ వద్ద విలెకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒత్తిడి తెచ్చేందుకు పరిమిత దాడి చేయడాన్ని పరిశీలిస్తున్నా నంటూ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు. కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఇతర వివరాలు చెప్పలేదు.

Donald Trump: ఇరాన్‌తో ఒప్పందం విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం!
Donald Trump

Updated on: Feb 21, 2026 | 1:20 AM

డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై పరిమిత స్థాయి సైనిక దాడి ను పరిగణిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఇది ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగానే ఈ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైట్ హౌస్‌లో గవర్నర్ల సమావేశంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ట్రంప్ ఇలా అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒత్తిడి తెచ్చేందుకు పరిమిత దాడి చేయడాన్ని పరిశీలిస్తున్నా నంటూ చెప్పుకొచ్చారు. ఇది ఇరాన్‌తో జరుగుతున్న అణు చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఒత్తిడి పెంచే వ్యూహంగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ ప్రకటను ముందు అంటే ఫిబ్రవరి 19న ట్రంప్ ఇరాన్‌కు కొత్త అణు ఒప్పందం చేసుకోవడానికి 10 నుండి 15 రోజుల గడువు ఇచ్చారు. ఒప్పందం కుదరకపోతే మీకే చెడు జరుగుతుందని హెచ్చరించారు. ఈ ప్రకటన మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలను పెంచింది. అలాగే ట్రంప్ ఇరాన్ వైపు భారీ నావికా దళాన్ని పంపిస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us