Srilanka Flag: అమేజాన్‌లో శ్రీలంక జాతీయ జెండాతో కూడిన బికినీలు, డోర్‌ మ్యాట్‌లు.. చైనా దేశంపై మండిపాటు..

Srilanka Flag On Door Mats: పలు దేశాలకు చెందిన జాతీయ జెండాలను అవమానపరుస్తూ బాత్‌ రూమ్‌ టైల్స్‌పై, డోర్‌ మ్యాట్‌లపై జెండాలను ముద్రించిన సంఘటనలు గతంలో చాలా చూశే ఉంటాం. మన దేశానికి చెందిన హిందూ దేవుళ్లను కూడా ఇలాగే గతంలో..

Srilanka Flag: అమేజాన్‌లో శ్రీలంక జాతీయ జెండాతో కూడిన బికినీలు, డోర్‌ మ్యాట్‌లు.. చైనా దేశంపై మండిపాటు..
Srilanka Flag On

Updated on: Mar 15, 2021 | 11:47 PM

Srilanka Flag On Door Mats: పలు దేశాలకు చెందిన జాతీయ జెండాలను అవమానపరుస్తూ బాత్‌ రూమ్‌ టైల్స్‌పై, డోర్‌ మ్యాట్‌లపై జెండాలను ముద్రించిన సంఘటనలు గతంలో చాలా చూశే ఉంటాం. మన దేశానికి చెందిన హిందూ దేవుళ్లను కూడా ఇలాగే గతంలో అవమానపరిచిన విషయం తెలిసిందే. ఈ వస్తువులు ఏకంగా అమేజాన్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో దర్శనమిచ్చి సంచలనం సృష్టించాయి. అయితే తాజాగా శ్రీలంక జాతీయ జెండా విషయంలో కూడా ఇలాగే జరిగింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీలంక జాతీయ జెండా ముద్రించిన బికినీలు, డోర్‌ మ్యాట్‌లు అమేజాన్‌ విక్రయానికి పెట్టారు. దీంతో ఆ దేశం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ ప్రొడక్టులన్నీ చైనాలో తయారు చేయడం గమనార్హం. దీంతో శ్రీలంక ప్రభుత్వం ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. తమ జాతీయ జెండాతో కూడిన వస్తువుల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని అమేజాన్‌కు తెలిపింది. ఇక శ్రీలంక ప్రభుత్వం చైనా తీరుపై మండిపడింది. డ్రాగన్‌ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఈ ఉత్పత్తులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఇలాంటి ఉత్తత్తుల తయారీని, అమ్మకాలను శాశ్వతంగా ఆపేయాలని కోరారు. దీనికి సంబంధించి అమెజాన్ సంస్థకు నిరసన తెలియజేసిన శ్రీలంక ప్రభుత్వం.. ఇలాంటి ఉత్పత్తుల తయారీకి, అమ్మకాలకు ఇంతటితో శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని చైనా అధికారులను కోరింది. ఇక చైనాలోని శ్రీలంక ఎంబసీ ఈ విషయంపై.. తమ జాతీయ జెండాను అవమానించేలా ఉన్న అన్ని రకాల ఉత్పత్తుల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఓ ప్రకటనలో తేలింది. అంతేకాకుండా అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న శ్రీలంక ఎంబసీ అధికారులు ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది శ్రీలంక మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడమే అని ఫిర్యాదు చేశారు.

అమేజాన్‌ ప్రొడక్ట్స్‌పై న్యూస్‌ జర్నల్‌ చేసిన ట్వీట్‌..

Also Read: Daylight saving time In U S : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పగటి సమయం ఆదా కోసం టైం చేంజ్, ఇదే పర్మినెంట్ చేయాలంటోన్న అగ్రరాజ్య ప్రజలు

ఆస్ట్రేలియాలో మహిళలకు కోపం వచ్చింది. ఆడవారిపై అఘాయిత్యాలను ఆపాలంటూ నల్ల బట్టలు ధరించి నిరసన

Devil Horns Grandmother : ప్రపంచంలోనే విచిత్ర మహిళ.. ఈ బామ్మాగారి నుదిటి మీద జంతువులా కొమ్ములు