Single Letter License Plate: అదృష్టాన్ని తెచ్చే సింగిల్‌ లెటర్‌ కారు లైసెన్స్‌ ప్లేట్లు.. ఏకంగా రూ.27 కోట్లతో కొనుగోలు..

హాంకాంగ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన లూనార్ న్యూ ఇయర్ వేలంలో 'R' అక్షరంతో ఉన్న సింగిల్ లెటర్ కారు లైసెన్స్ ప్లేట్ సుమారు రూ. 27 కోట్లకు అమ్ముడుపోయింది..

Single Letter License Plate: అదృష్టాన్ని తెచ్చే సింగిల్‌ లెటర్‌ కారు లైసెన్స్‌ ప్లేట్లు.. ఏకంగా రూ.27 కోట్లతో కొనుగోలు..
Car Plate Auction

Updated on: Feb 13, 2023 | 8:41 PM

హాంకాంగ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన లూనార్ న్యూ ఇయర్ వేలంలో ‘R’ అక్షరంతో ఉన్న సింగిల్ లెటర్ కారు లైసెన్స్ ప్లేట్ సుమారు రూ. 27 కోట్లకు అమ్ముడుపోయింది. హాంకాంగ్‌లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన లైసెన్స్ ప్లేట్‌లలో ఇది రెండోది కావడం విశేషం. 2021లో ‘W’ అక్షరం కోసం రికార్డ్ చేసిన 26 హాంకాంగ్‌ మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. హాంకాంగ్‌ కార్‌ నంబర్‌ ప్లేట్లు కోట్ల రూపాయలకు విక్రయించడం యావత్‌ ప్రపంచాన్ని ఆమితాశ్చర్యాలకు గురిచేస్తోంది. కాగా “R” అక్షరంతో లైసెన్స్ ప్లేట్ కోసం హాంకాంగ్ రవాణా శాఖ ఆదివారం (ఫిబ్రవరి 13) లూనార్‌ వేలం నిర్వహించింది. ‘R’ అక్షరం ఉన్న నంబర్‌ ప్లేట్‌ అంత ధర పలకడానికి కారణం లేకపోలేదు. ‘రిచ్’ అనే పదంలోని మొదటి అక్షరం ‘R’తో మొదలవుతుందని, దీనిని కొనుగోలు చేస్తే తదుపరి 20 ఏళ్ల వరకు అదృష్టం వరిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.

ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ లామ్ సాయి-హంగ్ నివేదికల ప్రకారం.. 2006లో కార్ ప్లేట్ సిస్టంను ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 160కిపైగా వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంపాటల్లో దాదాపు 40,000కు పైగా నంబర్‌ ప్లేట్లు అమ్ముడుపోయాయి. దీని వల్ల హాంకాంగ్‌ ప్రభుత్వానికి 6 వందల హాంకాంగ్‌ మిలియన్‌ డాలర్లకుపైగా ఆదాయం వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us