Sea Ghost: సముద్రం తీరంలో ఎంజాయ్ చేయడాన్ని వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు. కాలంతో పనిలేకుండా సముద్ర బీచ్ వద్దకు వెళ్లి సేదదీరే ప్రకృతి ప్రేమికులు కూడా ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఎగసి పడే కెరటాలతో పోటీపడుతూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అలా సంతోషముగా గడిపే సమయంలో సముద్రం మధ్యలో నుంచి మనుషుల్లా కనిపించే “సముద్ర దెయ్యాలు పైకి వస్తే.. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది.. ఊహించండి.. ఒక్కసారిగా ఆలా సముద్రం మధ్యలో దెయ్యాల రూపం కనిపించగానే భయపడి అక్కడనుంచి గుండెలను అరచేతిలో పట్టుకుని పారిపోతాడు.. తాజాగా అటువంటి ఓ సంఘటన వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..
లోతైన సముద్రం నుంచి పైకి లేచిన దెయ్యాలు ఆంగ్లేసీ ఉత్తర తీరంలో పర్యాటకులకు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇవి ఎక్కువ కాలం ఐరిష్ సముద్రం క్రింద మునిగి ఉంటాయని స్తానిక సిబ్బంది చెప్పారు, అయితే ఇప్పుడూ హాలోవీన్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ లోని వింత ఆకారాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బీచ్ నిత్యం వేల మంది పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. వచ్చిన పర్యాటకులకు ఎదురుగా సముద్రంలో వింత ఆకారాలు కనిపించాయి. ఆ దృశ్యాలను చూసిన జనం భయంతో ఒక్కసారిగా అక్కడ నుంచి పరుగులు పెట్టారు.
సముద్రంలో దెయ్యాలు , ముసుగు ధరించిన వింత ఆకారాలు బయటకు వచ్చాయంటూ పుకారు షికారు చేసింది. దీంతో అధికారులు అసలు విషయం తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు. వెంటనే సముద్రంలోకి వెళ్లి చూశారు. అసలు విషయం తెలుసుకుని నవ్వుల్లో మునిగితేలారు. ఎందులకంటే అవి సముద్ర దెయ్యాలు, వింత ఆకారాలు కాదు.. పాత లైఫ్ బోట్ ర్యాంప్‌కు చెందిన చెక్కలని గుర్తించారు. ఆ చెక్కలు ఎప్పటి నుంచో సముద్రంలో ఉండిపోవడంతో నాచు, చెత్త వంటివి పేరుకుపోవడంతో వింత ఆకారాల్లా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. 1828 నుండి హోలీహెడ్‌లో పనిచేస్తున్న లైఫ్‌బోట్ సిబ్బంది ధైర్యానికి ఇప్పుడు నిదర్శనం ఈ చెక్కలు.. వీటిని ప్రకృతి మానవ ఆకారాలుగా రూపొందించింది.
Also Read: కేసీఆర్ బయోపిక్.. ‘తెలంగాణ దేవుడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..