Russia-Ukraine war: పుతిన్‌ ప్రైవేట్‌ ప్యాలెస్‌పై డ్రోన్‌ దాడి.. నాటు నాటు సాంగ్‌తో ఉక్రెయిన్ ఆర్మీ సెలబ్రేషన్..

రష్యా -ఉక్రెయిన్‌ మధ్య యుద్దం మరింత తీవ్రరూపం దాల్చింది. డ్రోన్లతో ఇరుదేశాలు పోటాపోటీగా దాడులు చేసుకుంటున్నాయి. పుతిన్‌ ప్రైవేట్‌ ప్యాలెస్‌పై కూడా డ్రోన్‌ దాడికి ప్రయత్నించింది ఉక్రెయిన్‌.

Russia-Ukraine war: పుతిన్‌ ప్రైవేట్‌ ప్యాలెస్‌పై డ్రోన్‌ దాడి.. నాటు నాటు సాంగ్‌తో ఉక్రెయిన్ ఆర్మీ సెలబ్రేషన్..
Vladimir Putin

Updated on: May 30, 2023 | 8:27 PM

రష్యా -ఉక్రెయిన్‌ మధ్య వార్‌ మరింత ముదిరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను టార్గెట్‌ చేస్తూ ఉక్రెయిన్‌ వరుసగా డ్రోన్‌ దాడులు చేసింది. పుతిన్‌ ప్రైవేట్‌ ప్యాలెస్‌కు సమీపంలొ కూడా ఓ డ్రోన్‌ దాడి జరిగింది. అయితే ఈ దాడి నుంచి పుతిన్‌ క్షేమంగా బయటపడ్డారని రష్యా సైనిక వర్గాలు వెల్లడించాయి. మాస్కోపై ఉక్రెయిన్‌ 30కి పైగా డ్రోన్లు ప్రయోగించింది. అందులో 23 డ్రోన్లను రష్యా సైన్యం కూల్చేసింది. డ్రోన్‌ దాడి తరువాత మాస్కోలో హైఅలర్ట్‌ ప్రకటించారు. మాస్కోలో భద్రతా బలగాలకు సెలవును రద్దు చేశారు. హైఅలర్ట్‌ జారీ చేశారు. 10 డ్రోన్లు తమ లక్ష్యాన్ని చేధించాయని ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది.

రష్యా ఆక్రమించిన ప్రాంతాలపై కాకుండా మాస్కోపై గురిపెట్టి ఉక్రెయిన్‌ తన యుద్ద వ్యూహాన్ని మార్చుకుంది. మాస్కోపై డ్రోన్ల దాడిపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉగ్రవాద చర్య అని , తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. అంతకుముందు రష్యా కూడా ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా దాడిలో ముగ్గురు సామాన్య పౌరులు చనిపోయారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. కీవ్‌లో చాలా నష్టం జరిగింది . ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు.

ఉక్రెయిన్ ఆర్మీ నాటు నాటు సాంగ్‌పై ..

రష్యాపై దాడులను ఉక్రెయిన్‌ సైన్యం ప్రత్యేక రీతిలో సెలబ్రేట్‌ చేసుకుంది. తమపై రష్యా చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఆర్మీ నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ వీడియో విడుదల చేసింది. ఉక్రెయిన్‌ ఆర్మీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రీ ట్వీట్ చేసింది.

నాటు నాటు సాంగ్ ని ఉక్రెయిన్ ఆర్మీ తమ భాషలోకి అనువదించుకుని పెర్ఫామ్ చేసింది. రష్యా ఆర్మీని విలన్ గా చూపిస్తూ ఎనర్జిటిక్ గా, ఫన్నీగా చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం