పోర్న్‌స్టార్‌కు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రాం… అకౌంట్ బ్లాక్… అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలోనే చర్య….

| Edited By: Anil kumar poka

Jun 22, 2021 | 1:03 PM

పోర్న్‌స్టార్‌కు ఇన్ ‌స్టాగ్రాం షాక్ ఇచ్చింది. నగ్నంగా ఉన్న పోస్టులు, ఇన్‌స్టాగ్రాం సీఈఓపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేసింది.

పోర్న్‌స్టార్‌కు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రాం... అకౌంట్ బ్లాక్... అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలోనే చర్య....
Follow us on

పోర్న్‌స్టార్‌కు ఇన్ ‌స్టాగ్రాం షాక్ ఇచ్చింది. నగ్నంగా ఉన్న పోస్టులు, ఇన్‌స్టాగ్రాం సీఈఓపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ప్రముఖ పత్రిక కథనం ప్రకారం కెనడ్రా సుందర్ల్యాండ్ అనే పోర్న్‌స్టార్ ఇన్‌స్టాగ్రాం వేదికగా తన నగ్న చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్స్టా పోస్టులో రాస్తూ… ఇన్‌స్టాగ్రాం సీఈఓ అడమ్ మొస్సోరితో శారీరిక సంబంధం ఉన్నట్లు తెలిపింది.

 

అయితే ఆమె నగ్న చిత్రాలు పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేశారు. అంతేకాకుండా ఇన్‌స్టా ప్రతినిధులు మాట్లాడుతూ… తమ సీఈఓకు పోర్న్‌స్టార్‌కు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. కోట్లాది మంది అకౌంట్ కలిగిన ఇన్‌స్టాగ్రాంలో అప్పడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా నిబంధనల ప్రకారం ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు వివరించారు. కాగా, తన అకౌంట్ బ్లాక్ కావడంపై పోర్న్‌స్టార్ స్పందించారు. తాను తాగిన మత్తులో ఆ ఫోటోలు పోస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా తనకు ఇన్‌స్టాగ్రాం సీఈఓ ఎవరో కూడా తెలియదని అంది.