PM Modi: మాల్దీవుల పర్యనలో ప్రధాని మోదీ.. స్వయంగా వచ్చి ఆహ్వానించిన ముయిజ్జు!

Updated on: Jul 25, 2025 | 12:10 PM

బ్రిటన్‌ పర్యటనలో భాగంగా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ప్రధాని మోదీ, లండన్‌ నుంచి మాల్దీవులకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ దేశంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి ఆదేశ అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, విదేశాంగ, రక్షణ, ఆర్థిక, హోంశాఖ మంత్రులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.

బ్రిటన్‌ పర్యటనలో భాగంగా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ప్రధాని మోదీ, లండన్‌ నుంచి మాల్దీవులకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ దేశంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి ఆదేశ అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, విదేశాంగ, రక్షణ, ఆర్థిక, హోంశాఖ మంత్రులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల 60వ స్వాతంత్ర్యవేడుకలకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ టూర్‌లో ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు.

గతంలో భారత్‌తో వివాదం..

ఇదిలా ఉండగా గతంలో భారత్‌-మాల్దీవుల బంధం బలహీనపడింది. చైనా ప్రలోభాలకు లొంగిన మాల్దీవులు- అప్పట్లో తన వైఖరి మార్చుకుంది. తమ దేశంలో ఉన్న భారత రక్షణబలగాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా భారత్‌తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని నిర్ణయించింది. భారత్‌తో వాగ్వాదం పెట్టుకుంది. దీంతో ఆగ్రహించిన భారతీయులు మాల్దీవులకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో మాల్దీవుల టూరిజం భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంతో తన నిర్ణయాల ప్రభావం ఎలా ఉందనేది మయిజ్జుకు త్వరగానే అర్థమైంది. దాందో భారత్‌లో సంబంధాలను మొరుగు పర్చుకోవడానికి అతని ముందుకొచ్చారు. ఇందులో భాగంగానే గతేడాది భారత్‌ పర్యటనకు వచ్చిన మయిజ్జు.. మోదీని మాల్దీవుల పర్యటనకు ఆహ్వానించారు. కాగా తాజాగా ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Jul 25, 2025 12:09 PM