కనీసం “పీఓకే”నైనా కాపాడండి..

| Edited By:

Aug 27, 2019 | 8:55 PM

జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అంశం.. పాక్ రాజకీయాల్లో వేడినిపుట్టిస్తున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ఇమ్రాన్ ఖాన్‌ తీరుపై మండిపడ్డారు. ఇమ్రాన్ ప్రభుత్వం విఫలమైనంతగా మరే ప్రభుత్వం విఫలం కాలేదన్నారు. ఒకప్పుడు శ్రీనగర్‌ను భారత్ నుంచి ఎలా వేరుచేయాలా అనేది ప్రభుత్వ విధానంగా ఉండేదని.. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా అయ్యిందన్నారు. ఇమ్రాన్ చేతకానితనం కారణంగా […]

కనీసం పీఓకేనైనా కాపాడండి..
Follow us on

జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అంశం.. పాక్ రాజకీయాల్లో వేడినిపుట్టిస్తున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ఇమ్రాన్ ఖాన్‌ తీరుపై మండిపడ్డారు. ఇమ్రాన్ ప్రభుత్వం విఫలమైనంతగా మరే ప్రభుత్వం విఫలం కాలేదన్నారు. ఒకప్పుడు శ్రీనగర్‌ను భారత్ నుంచి ఎలా వేరుచేయాలా అనేది ప్రభుత్వ విధానంగా ఉండేదని.. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా అయ్యిందన్నారు. ఇమ్రాన్ చేతకానితనం కారణంగా ముజఫరాబాద్( పాక్ ఆక్రమిత కశ్మీర్) మన ఆధీనంలో ఉంటే చాలనే స్థితికి వచ్చామన్నారు. కాగా, కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్థాన్‌కు బాసటగా నిలవకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు.