లండన్‌లో పాక్ అధికారి ఓవరాక్షన్‌.. పీకలు కోస్తామంటూ వార్నింగ్.. రగిలిపోతున్న భారతీయులు!

మింగా మెతుకు లేదుగాని.. మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడు వెనకటికి ఒకడు. ఆర్థికంగా దారుణమైన పతనంలో ఉన్న తమ దేశం గురించి ఏం ఊహించుకుంటున్నారోగాని.. భారత్‌తో ఢీకొడతాం.. పడగొడతాం అంటూ అధిక ప్రేలాపనలు పేలుతున్నారు పాకిస్తానీలు. అంతకు మించి.. ఓ ఆ దేశపు అధికారి చేసిన ఓవరాక్షన్‌తో భారతీయులు రగిలిపోతున్నారు.

లండన్‌లో పాక్ అధికారి ఓవరాక్షన్‌.. పీకలు కోస్తామంటూ వార్నింగ్.. రగిలిపోతున్న భారతీయులు!
Colonel Taimur Rahat

Updated on: Apr 26, 2025 | 5:59 PM

మింగా మెతుకు లేదుగాని.. మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడు వెనకటికి ఒకడు. ఆర్థికంగా దారుణమైన పతనంలో ఉన్న తమ దేశం గురించి ఏం ఊహించుకుంటున్నారోగాని.. భారత్‌తో ఢీకొడతాం.. పడగొడతాం అంటూ అధిక ప్రేలాపనలు పేలుతున్నారు పాకిస్తానీలు. అంతకు మించి.. ఓ ఆ దేశపు అధికారి చేసిన ఓవరాక్షన్‌తో భారతీయులు రగిలిపోతున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దాడి చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, లండన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి. లండన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల భారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పాకిస్తాన్ అధికారి రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డాడు. వైరల్ వీడియోలో, లండన్‌లో భారతీయులు నిరసన తెలుపుతున్నారు. అదే సమయంలో బ్రిటన్‌లోని పాకిస్తాన్ మిషన్ అటాచ్ అయిన కల్నల్ తైమూర్ రహత్ కెమెరా ముందు భారతీయుల తలలు నరికివేస్తానని బెదిరించాడు. ఈ పాకిస్తానీ అధికారి చేతిలో వైమానిక దళ అధికారి అభినందన్ ఫోటో పట్టుకుని ఉన్నాడు. దానిపై “చాయ్ ఈజ్ ఫెంటాస్టిక్” అని రాసి ఉంది.

బ్రిటన్‌లో ఉన్న పాక్ హైకమిషన్‌లో పనిచేసే ఈ వ్యక్తి పేరు తైముర్‌ రహత్‌. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఎన్నారైలు పాక్‌ హైకమిషన్‌ ముందు నిరసన చేపట్టారు. శాంతియుతంగా సాగుతున్న సమయంలో హైకమిషన్‌ ముందుకు వచ్చిన ఇతగాడు ఒళ్లు కొవ్వెక్కిన సైగలు చేశాడు. మీ పీక కోసేస్తామన్న తీరులో అతడి ప్రవర్తన ఉంది. పహల్గామ్‌ నరమేధాన్ని చూసి మానవత్వం ఉన్న ఎవరైనా చలించిపోవాల్సిందే.. కానీ ఉగ్రవాదానికి ఊతమిస్తూ.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కబుర్లు చెప్పే పాపిస్తాన్‌ గూండాలు.. ఎక్కడో పీవోకేలో మాత్రమే కాదు.. ఇదిగో ఇలా దౌత్య కార్యాలయాల్లో కూడా కనిపిస్తున్నారు.

పాకిస్థాన్ డిఫెన్స్ అటాషెగా పనిచేస్తున్న తైమూర్ రహత్ నిరసనకారులను రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సొంత ప్రజలే చీత్కరించుకుంటున్నారు. భారత వింగ్ కమాండర్ అభినందన్‌ చిత్రం చూపిస్తూ గొంతు కోస్తున్నట్లు సైగ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. నిరనస తెలుపుతున్న భారతీయులంతా పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. లండన్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల, “ఐక్యత, న్యాయం, మానవత్వం కోసం నిలబడటానికి, అమాయక ప్రజలపై ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మాతో చేరండి” అని రాసి ఉన్న ఫ్లకార్టులన ప్రదర్శించారు. పాకిస్తాన్ నిరసనకారులు లౌడ్ స్పీకర్లలో దేశభక్తి గీతాలను ప్లే చేయడం ద్వారా భారత నిరసనకారుల నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించారు.

ఇక్కడితో పాకిస్తాన్‌ కావరం అయిపోలేదు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని భుట్టో వారసుడు బిలావల్‌ భుట్టో జనాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ వైపు తప్పు ఉన్నపుడు అన్నీ మూసుకుని కూర్చోవాల్సిన వ్యక్తి.. రెండు దేశాల మధ్య మరిన్ని ఉద్రిక్తతలు చెలరేగేలా ప్రసంగించాడు. సింధు నది మాది.. ఇందులో నీరైనా పారాలి.. భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు బిలావల్‌.

పాక్‌ ప్రధానమంత్రి తక్కువేం తినలే. ఆయన కూడా సింధునదిపై అధిక ప్రసంగం చేశారు. సింధు జలాలను ఆపాలని చూసినా, తగ్గించాలని అనుకున్నా, డైవర్ట్‌ చేయాలనుకున్నా తమ శక్తిమొత్తం ఉపయోగించి తిప్పికొడతాం అంటూ కామెంట్‌ చేశాడు. ఇక భారత్‌లో ఉగ్రదాడులకు మాస్టర్‌ మైండ్‌గా ఉన్న హఫీజ్‌ సయీద్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్నాడు. ఎంతోమంది ఉగ్రవాదులను తయారుచేసే ఈ కిరాతకుడు.. మన ప్రధాని మోదీపై పిచ్చి కూతలు కూశాడు. సింధు జలాలను ఆపితే.. మోదీ శ్వాస ఆపుతామంటూ విషం కక్కాడు.

మన నీళ్లు తాగుతూ.. మన డ్యామ్‌ నుంచి జలాలను వదిలితే పంటలు పండించుకుంటూ.. మన దయపై బతుకుతున్న పాకిస్తాన్‌.. తిన్నది అరగక మాట్లాడుతున్న మాటలివి. నాలుగురోజులు నీళ్లు ఆపితే నెత్తికెక్కిన కళ్లు దిగవా? నాలుగు నెలలు పంటలు ఎండితే మోదీ కాళ్లపై పడి అడుక్కోరా..? ఈ వట్టిమాటలకు గట్టి సమాధానమే ఉండబోతోంది. సింధు జలాల నిలుపుదల జస్ట్‌ ట్రైలర్‌ మాత్రమే.. ముందుంది ముసళ్ల పండగ అంటోంది మోదీ ప్రభుత్వం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..