
అమెరికాలోని వింత ఘటన వెలుగు చూసింది. జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్ (JBER) సైనిక స్థావరం సమీపంలోని గాల్లో ఓ జెల్లిఫిష్ ఆకారంలో నల్లటి ఓ ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆకాశంలో వచ్చిన ఇంద్రధనస్సును ఫోటో తీసేందుకు యాంకరేజ్‌కు చెందిన సారా జేన్ ఓస్బోర్న్ అనే మహిళ ప్రయత్నిస్తుండగా ఈ చిత్రం కనిపించింది.
గాల్లో ఆ నల్లటి ఆకారాన్ని గమనించిన ఓస్పోర్న్ వెంటనే తన భర్త పీట్‌ను పిలిచి చూపించగా, ఇద్దరూ కలిసి దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇదికాస్తా వైరల్‌గా మారంది. ఈ వీడియోలో చెట్ల వరుసకు పైన జెల్లీఫిష్ ఆకారంలో ఉన్న నల్లటి వస్తువు గాలిలో తేలియాడుతూ కనిపించింది. సుమారు మూడు నిమిషాల పాటు కనిపించిన ఆ వింత వస్తువు ఆ తర్వాత అకస్మాత్తుగా మాయమైందని ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు.
ఆ వస్తువు ఎంత వేగంగా కనిపించిందో అంతే వేగంగా అదృశ్యమైందని తలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ వస్తువు ఏమై ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అయితే, అది నిజంగా గుర్తుతెలియని ఎగిరే వస్తువా? లేక మరేదైనా వస్తువా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.
వీడియో చూడండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.