Viral Video: ర్యాంప్‌ వాక్ చేస్తూ.. స్టేజ్‌పై నుంచి జారి పడిపోయిన మిస్‌ జమైకా..

మిస్ యూనివర్స్-2025 పోటీల్లో ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ జమైకా గాబ్రియెల్లే హెన్రీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈనెల 19న ప్రిలిమినరీ గౌన్ రౌండ్ సందర్భంగా హెన్రీ స్టేజీ పైనుంచి కిందపడటంతో వెంటనే స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగుతుండగా త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని నిర్వాహకులు తెలిపారు.

Viral Video: ర్యాంప్‌ వాక్ చేస్తూ.. స్టేజ్‌పై నుంచి జారి పడిపోయిన మిస్‌ జమైకా..
Viral Video

Updated on: Nov 25, 2025 | 1:49 PM

థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ సుందరీమణుల ర్యాంప్‌ వాక్‌ పోటీల్లో నవంబర్ 19న ఈ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.స్టేజీపై నడుస్తుండగా మిస్ జమైకా కింద ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ పోటీల్లో జమైకా నుంచి మిస్ జమైకా డాక్టర్ గాబ్రియెల్ హెన్రీ పాల్గొంది. ఈ క్రమంలో ప్రిలిమినరీ ఈవెనింగ్ గౌన్ రౌండ్‌లో పాల్గొన్న హెన్రీ ఆడియన్స్‌ని వైపు చూస్తూ స్టేజిపై నడుస్తుండగా.. ముందు దారి లేకపోవడంతో ఆమె ఒక్కసారిగా పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఆమెను స్ట్రెచ్చర్‌పై హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. ఈ సంఘటన జరినప్పటికీ.. ఈ పోటీ మాత్రం ఆగలేదు.. ఈ పోటీల్లో మిస్ యూనివర్స్-2025గా మెక్సికోకు చెందిన ఫాతిమా విజేతగా నిలిచింది.

వీడియో చూడండి..


ఈ ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. మిస్ జమైకా గాబ్రియెల్లే హెన్రీ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారని తెలిపారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని.. కానీ ఆమె ఇప్పటికీ వైద్యుల సంరక్షణలో ఉన్నారని.. త్వరలోనే హాస్పిటల్‌ నుంచి డిచ్చార్జ్ అవుతారని తెలిపారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల ప్రయాణంతో సహా సంబంధిత అన్ని ఖర్చులను మిస్‌ యూనివర్స్‌ పోటీ నిర్వాహణ సంస్థ చూసుకుందని ఆయన తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.