హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వీడేనా? అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

అమెరికా - ఇరాన్ మధ్య గత రెండు నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది.

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వీడేనా? అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
Iran Us Peace Talks

Updated on: May 10, 2026 | 9:30 PM

అమెరికా – ఇరాన్ మధ్య గత రెండు నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయి, తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది.

ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనలకు ఇరాన్ తన అధికారిక ప్రతిస్పందనను సమర్పించింది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, పాకిస్థాన్ ఈ చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్ తన ప్రతిస్పందనను ఇస్లామాబాద్ ద్వారానే అమెరికాకు చేరవేసింది. ప్రస్తుతం ఇరు దేశాల ప్రాధాన్యత కేవలం యుద్ధాన్ని నివారించడం, ప్రాంతీయ భద్రతను పునరుద్ధరించడంపైనే ఉందని సమాచారం.

ప్రస్తుతానికి ఇరు దేశాలు ఒక సమగ్ర ఒప్పందానికి రాకపోయినా, తక్షణ ఉపశమనం కోసం MoU కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకాయానాన్ని తక్షణమే ప్రారంభించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇరువైపులా ప్రాణనష్టం, ఆర్థిక నష్టాన్ని ఆపేందుకు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలి. ఇరాన్ అణు కార్యక్రమం వంటి సున్నితమైన అంశాలపై భవిష్యత్తులో లోతైన చర్చలు జరపాలని ఈమేరకు ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నాయి.

ఒకవైపు యుద్ధం ముగింపు ప్రయత్నాలు జరుగుతుండగా, అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానం నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 శాతం సుంకం విధింపుపై కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మే 10 నాటికి అందుతున్న సమాచారం ప్రకారం, ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వకుండానే అసంపూర్తిగా ముగిశాయి. అయినప్పటికీ, ప్రపంచ దేశాల ఒత్తిడి నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాలు దౌత్య మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారితీస్తుందో లేదో చూడాలి..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us