Viral Video: వీడేం లవర్.. తండ్రి పోయిన బాధలో ఉన్న అమ్మాయికి.. అంత్యక్రియల్లో ప్రపోజ్ చేశాడు

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియల కోసం స్మశానానికి వెళ్లింది. విషాదంలో ఉన్న ఆమె వద్దకు చర్చిలో పని చేస్తున్న పాస్టర్ వచ్చాడు. ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని.. 'పెళ్లి చేసుకుంటావా' అని అడిగాడు..

Viral Video: వీడేం లవర్.. తండ్రి పోయిన బాధలో ఉన్న అమ్మాయికి.. అంత్యక్రియల్లో ప్రపోజ్ చేశాడు
Man Proposes To Girlfriend

Updated on: May 13, 2022 | 5:08 PM

Viral Video:  సృష్టిలోఅద్భుతమైంది ప్రేమ.. తమ ప్రేమను వ్యక్త పరచడానికి, ఆ ప్రేమను గెలిచి.. జీవితంలో ఒకటి కావటానికి  యువతీయువకులు ఒక యుద్ధమే చేస్తారు. ఇక తాము ప్రేమిస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే అవతలివారికి అది అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ చెప్పినప్పుడు అంగీకరిస్తారా లేదా అని భయపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు మంచి సమయం, సందర్భం చూసి చెబితే, మరికొందరు అందమైన బహుమతులు ఇచ్చి లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంటారు. అయితే దక్షిణాఫ్రికాకు (South Africa) చెందిన ఓ వ్యక్తి ఎలాంటి సెంటిమెంట్లకు, సమయం సందర్భాన్ని చూసుకోకుండా.. భయాలకు తావు లేకుండా ఎంతో ధైర్యంగా తన లవ్‌ ప్రపోజల్‌ను ప్రియురాలి ముందుంచాడు. అది చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. వీడెవడండీ బాబు.. సమయం, సందర్భం ఉండక్కర్లా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట(Video Viral) చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియల కోసం స్మశానానికి వెళ్లింది. విషాదంలో ఉన్న ఆమె వద్దకు చర్చిలో పని చేస్తున్న పాస్టర్ వచ్చాడు. ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని.. ‘పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. ఆమె చేతికి ఉంగరాన్ని కూడా తొడిగాడు. ఆమె ఆ సమయంలో తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. మొజెలా అనే యువతి ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి చేసిన పనికి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రేండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us