లంచ్‌ చేసి వచ్చేసరికి ఉద్యోగం ఔట్‌.. 550 మందికి ఉద్వాసన!

ప్రముఖ ఏఐ సేవల సంస్థ ఇన్నోడేటాలో ఉద్యోగుల తొలగింపులు కలకలం రేపాయి. భారత్‌లో దాదాపు 550 మంది ఉద్యోగాలు కోల్పోగా ఫిలిప్పీన్స్‌లోనూ ఉద్యోగులపై వేటు పడింది. ఉదయం మామూలుగానే విధులకు హాజరైన ఉద్యోగులకు లంచ్ తర్వాత కంపెనీ సిస్టమ్‌ల నుంచి లాగ్‌అవుట్‌ కావడం, అధికారిక ఐడీలు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.

లంచ్‌ చేసి వచ్చేసరికి ఉద్యోగం ఔట్‌.. 550 మందికి ఉద్వాసన!
Laptops Logged Out Ids Deactivated Innodata Lays Off 500 In India More In Philippines

Updated on: Oct 27, 2026 | 8:58 PM

ప్రముఖ ఏఐ సేవల సంస్థ ఇన్నోడేటాలో ఉద్యోగుల తొలగింపులు కలకలం రేపాయి. భారత్‌లో దాదాపు 550 మంది ఉద్యోగాలు కోల్పోగా ఫిలిప్పీన్స్‌లోనూ ఉద్యోగులపై వేటు పడింది. ఉదయం మామూలుగానే విధులకు హాజరైన ఉద్యోగులకు లంచ్ తర్వాత కంపెనీ సిస్టమ్‌ల నుంచి లాగ్‌అవుట్‌ కావడం, అధికారిక ఐడీలు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.

ఉదయం అంతా మామూలే.. మధ్యాహ్నం తర్వాత కలకలం

ఢిల్లీలో పనిచేస్తున్న 28 ఏళ్ల ఇంజినీర్‌కు అక్టోబర్‌ 26 సోమవారం సాధారణ పనిదినం లాగానే ప్రారంభమైంది. మిగతా ఉద్యోగుల మాదిరిగానే కంపెనీ సిస్టమ్‌లోకి లాగిన్‌ అయ్యాడు. హాజరు నమోదు చేసుకుని రోజువారీ పనులు మొదలుపెట్టాడు. అయితే, మధ్యాహ్నం సమయానికి కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయన్న వార్తలు వ్యాపించాయి. మొదట ఫిలిప్పీన్స్‌లోని కంపెనీ ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం అందింది. అక్కడ క్వాలిటీ నిపుణులు, టీమ్‌ లీడర్లు, ఆపరేషన్స్‌ మేనేజర్లకు సంబంధించిన ఉద్యోగాలపై వేటు పడినట్లు తెలిసింది.

ఒక్కొక్కటిగా ల్యాప్‌టాప్‌లు లాగ్‌అవుట్‌.. ఐడీలు నిలిపివేత

భారత్ లో ఉద్యోగుల కంపెనీ అకౌంట్లకు సంబంధించిన యాక్సెస్‌ లంచ్ తర్వాత నిలిచిపోయింది. ల్యాప్‌టాప్‌ల నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్‌ కావడం, అధికారిక ఐడీలు పనిచేయకపోవడం మొదలైంది. దీంతో ఉద్యోగులు మరింత ఆందోళనకు గురయ్యారు. కంపెనీ వ్యవస్థల్లోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో సహోద్యోగులను సంప్రదించేందుకు వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రానికి ఆ గ్రూపులో దాదాపు 500 మంది చేరినట్లు ఓ ఉద్యోగి తెలిపాడు. వారిలో చాలామంది తమ ఉద్యోగ పరిస్థితిపై స్పష్టత లేదని తెలిపారు.

వ్యక్తిగత ఈ-మెయిల్స్‌కు టెర్మినేషన్‌ లేఖలు

తొలగింపుకు ముందు ఉద్యోగులతో హెచ్‌ఆర్‌ విభాగం సంప్రదింపులు జరపలేదని, జీతం స్లిప్పులు, ఇతర ముఖ్యమైన పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ యాప్‌కు యాక్సెస్‌ నిలిపివేయడంతో అవసరమైన రికార్డులను పొందడం కష్టంగా మారింది.
వ్యాపార అవసరాల కారణంగానే ఉద్యోగులను తొలగించామని ఇన్నోడేటా సంస్థ తెలిపింది. ఉద్యోగుల పనితీరుతో ఈ నిర్ణయానికి సంబంధం లేదని ఉద్యోగులకు పంపిన ఈ -మెయిల్‌లో స్పష్టం చేసింది.

ఫిలిప్పీన్స్‌లోనూ ఉద్యోగాల కోత?

న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్నోడేటా సంస్థ.. ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో ఇతర కంపెనీలకు సహకరిస్తోంది. ఏఐ వ్యవస్థల తయారీ, వాటి పనితీరును మెరుగుపరచడం వంటి సేవలను అందిస్తోంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, సోనీ, బోయింగ్‌, డెలాయిట్‌ వంటి ప్రముఖ సంస్థలు ఇన్నోడేటా కస్టమర్లుగా ఉన్నాయి. 2025 వార్షిక నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 10,107 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us