ఇప్పుడు ప్రపంచ దృష్టంతా రష్యా- ఉక్రెయిన్ దేశాలపైనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తాయా? లేక ఇరుదేశాల మధ్య రాజీ కుదిరి అంతా సర్దుకుంటుందా? అని ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈక్రమంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకు చాలామంది వార్తా ఛానళ్లనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్లే వివిధ వార్తా ఛానళ్ల రిపోర్టర్లు యుద్ధ క్షేత్రం నుంచే ఎక్స్‌క్లూజివ్ విజువల్స్, వార్తలను అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈనేపథ్యంలో అమెరికాకు చెందిన రిపోర్టర్‌కు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోన్న అతడు.. ఆరు భాషల్లో సమాచారం అందించడమే దీనికి కారణం.
కాగా ఆ రిపోర్టర్ పేరు ఫిలిప్ క్రాథర్. ఈయన ఫిలిప్ అసోసియేటెడ్ ప్రెస్ గ్లోబల్ మీడియాకు ఆన్‌లైన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను కీవ్‌లోనే ఉంటూ అక్కడి నుంచే ఇతర మీడియా సంస్థలకు కూడా పనిచేస్తున్నాడు. మొత్తం ఆరు రకాల భాషల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న అంశాలను ఆయా వార్తా ఛానళ్లకు సమాచారం అందిస్తున్నారు. ఇంగ్లిష్, లగ్జంబర్గ్, స్పానిష్, పోర్చుగ్రీస్, ఫ్రెంచ్, జర్మనీ.. ఇలా ఆరు భాషల్లో రిపోర్టింగ్ చేస్తున్న ఫిలిప్..’ఈ ఉద్రిక్త పరిస్థితుల గురించి కీవ్ నుంచి ఆరు భాషల్లో రిపోర్టు చేశాను’ అంటూ తన వీడియోను షేర్ చేశారు. ఇందులో తాను మాట్లాడిన భాషల వరుస క్రమాన్ని కూడా ఉంచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆరు భాషలు మాట్లాడేవారు ఉన్నారని తెలుసు. కానీ, ఇలా ఆరు భాషల్లో లైవ్ రిపోర్టింగ్‌ను చేసినవారిని నేను ఇంతవరకు చూడలేదు. అమేజింగ్ రిపోర్టింగ్’ అంటూ చాలామంది రిపోర్టర్లు ఫిలిప్ ధైర్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Six-language coverage from #Kyiv with @AP_GMS. In this order: English, Luxembourgish, Spanish, Portuguese, French, and German. pic.twitter.com/kyEg0aCCoT
— Philip Crowther (@PhilipinDC) February 21, 2022
I know a few people that speak six languages, but I’ve never seen anyone that can do live-TV in all of them with such poise and clarity. Bravo! https://t.co/fxgJp80i2L
— Enrique Acevedo (@Enrique_Acevedo) February 22, 2022
Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..
Statue of Equality: సమతాస్ఫూర్తి కేంద్ర సందర్శకులకు అనుమతి.. టైమింగ్స్ ఇవే..