“లేజీ గ్లాసెస్”తో గది పై కప్పును చూస్తూ టీవీ చూడొచ్చు! అదెలా అంటారా?

ఇక పై కూర్చొని టీవీ చూడటం, పుస్తకం చదవాలని లేదు! పడుకున్న పొజిషన్ లో గది పై కప్పును చూస్తూ కూడా టీవీ చూడొచ్చు! నమ్మ లేకపోతున్నారా? తలను ముందుకు వంచకుండా పడుకున్న పొజిషన్ లోనే  టీవీని చూపించే కొత్త గ్లాసెస్ ను జపాన్ కంపెనీ డిజైన్ చేసింది. దీని పేరు "లేజీ గ్లాసెస్'' అయితే ఇది ఏదో బద్ధకంతో వాడే వస్తువు కాదు. సర్జరీ తర్వాత కోలుకుంటున్న వారికి, మంచంపై పడుకుని ఎక్కువ సేపు మొబైల్స్, లాప్‌టాప్‌లు చూస్తూ మెడ నొప్పితో బాధపడే వారికి ఇవి సహాయపడతాయి.

లేజీ గ్లాసెస్తో గది పై కప్పును చూస్తూ టీవీ చూడొచ్చు! అదెలా అంటారా?
Japan Invented Glasses For People Too Lazy To Sit Up

Updated on: Sep 03, 2026 | 7:19 PM

ఇక కూర్చొని టీవీ చూడటం, పుస్తకం చదివే ముచ్చటే లేదు! ఈ గ్లాసెస్ తో పడుకుని గది పై కప్పును చూస్తూ కూడా టీవీ చూడొచ్చు! నమ్మబుద్ధి కావడం లేదా? అసలు తల తిప్పకుండా పడుకున్న పొజిషన్ లోనే  టీవీ చూపించే కొత్త గ్లాసెస్ ను జపాన్ కంపెనీ డిజైన్ చేసింది. దీని పేరు “లేజీ గ్లాసెస్” అయితే ఇది ఏదో బద్ధకంతో వాడే వస్తువు కాదు. సర్జరీ తర్వాత కోలుకుంటున్న వారికి అలాగే మంచంపై పడుకుని ఎక్కువ సేపు మొబైల్స్, లాప్‌టాప్‌లు చూస్తూ మెడ నొప్పితో బాధపడే ప్రతీ ఒక్కరికీ ఇవి సహాయపడతాయి.

జలాంతర్గామిలో వాడే ‘పెరిస్కోప్’ కాంతి వక్రీభవన సూత్రాన్ని ఉపయోగించి దీనిని రూపొందించారు. ఈ కళ్లజోడులో అద్దాలకు బదులు  90 డిగ్రీల కోణంలో ఉండే గ్లాస్ ప్రిజమ్స్‌ను ఏర్పాటు చేసారు. మనం నేరుగా చూసే చూపును ఈ ప్రిజమ్స్ 90 డిగ్రీల కోణంలో కిందికి లేదా పైకి మళ్లిస్తాయి.

పడుకుని టీవీ చూడవచ్చు

ఉదాహరణకు, మీరు మంచంపై వెల్లకిలా పడుకుని తలను పక్కకు తిప్పకుండా  పుస్తకం చదవచ్చు  లేదా టీవీ చూడొచ్చు. దిండు పైన తల పెట్టుకుని, ఈ కళ్లజోడు పెట్టుకుంటే మీ కంటికి ఎదురుగా ఉన్న దృశ్యం లేదా పుస్తకం కనబడుతుంది. దీని వల్ల మెడ కండరాలపై ఎలాంటి ఒత్తిడి పడకుండా, చదవడం, చూడటం సాధ్యమవుతుంది.

దీనిలో ఉన్న ప్రత్యేకమైన ప్రిజమ్స్ మీ చూపును సరిగ్గా 90 డిగ్రీల కోణంలో మలుపు తిప్పుతాయి. ఇందులో  భూతద్దం కానీ, ఎలక్ట్రానిక్ స్క్రీన్ ను కానీ వాడలేదు. కేవలం లైట్ రిఫ్లెక్షన్ టెక్నిక్ తో పనిచేసేలా డిజైన్ చేసారు.  మంచంపై పడుకుని మామూలుగా మన కళ్ళు ఎక్కడ చూస్తాయో అటే చూడాలి. అంటే పై కప్పును చూడాలి.  మెడను పైకి ఎత్తాల్సిన అవసరం లేకుండా మీ కంటికి ఎదురుగా గోడ మీద ఉన్న టీవీ మీకు స్పష్టంగా కనిపిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us