Coconut Shell Mask: విధులను నిర్వహించడానికి మాస్క్ కష్టంగా ఉందంటూ కొబ్బరి చిప్పను మాస్క్‌గా ధరించిన వ్యక్తి.. ఎక్కడంటే..

|

Sep 12, 2021 | 3:23 PM

Coconut Shell Mask: కరోనా వైరస్ ప్రపంచంలో కల్లోలం మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ బతకాలంటే.. నోటికి బట్టకట్టలసిందే అన్న తీరుగా మారిపోయింది. కరోనా నివారణ కోసం నిబంధనలో భాగంగా ప్రతి ఒక్కరూ..

Coconut Shell Mask: విధులను నిర్వహించడానికి మాస్క్ కష్టంగా ఉందంటూ కొబ్బరి చిప్పను మాస్క్‌గా ధరించిన వ్యక్తి.. ఎక్కడంటే..
Coconut Shell Mask
Follow us on

Coconut Shell Mask: కరోనా వైరస్ ప్రపంచంలో కల్లోలం మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ బతకాలంటే.. నోటికి బట్టకట్టలసిందే అన్న తీరుగా మారిపోయింది. కరోనా నివారణ కోసం నిబంధనలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కోవిడ్ నేపథ్యంలో ఎందరో తమ ఉపాధిని కోల్పోతే.. మరెందరో.. మాస్కులు, శానిటైజర్స్ వంటివి అమ్ముతూ జీవనోపాధిని సృష్టించుకున్నారు కూడా.. ఇక మాస్కుల్లో కూడా తమ క్రియేటివిటీకి పదును పెడుతూ.. డిఫరెంట్ స్టైల్స్ లో , కలర్స్, డిజైన్స్ తో తయారు చేస్తున్నారు. భారతీయ మహిళలు ఐతే.. తమ చీరలకు మ్యాచింగ్ మాస్కులను తయారు చేసుకుంటున్నారు కూడా. ఇక డైమండ్స్ తో కూడా మాస్కులను తయారు చేయించుకుని రికార్డ్స్ లో కెక్కారు. తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో రకరకాల మాస్కులు తయారు చేస్తూ.. తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. తాజాగా ఇండోనేషియాలోని ఒక వ్యక్తి కొబ్బరి చిప్పను మాస్క్ గా ధరించి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.

బాలిలో ఓ పార్కింగ్ అటెండెంట్ ‘నేంగా బుడియాసా’ అనే వ్యక్తికి పార్కింగ్ ప్లేస్ లో విధులు నిర్వహిస్తాడు. అయితే డ్యూటీలో భాగంగా అతను నిత్యం ఈలను వాడాల్సి ఉంటుంది. దీంతో రెగ్యులర్ మాస్కులు ధరిస్తే.. విజిల్ వేయడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొబ్బరిచిప్పకు హోల్ పెట్టి విజిల్ ఊదేందుకు అనువుగా తయారుచేసుకున్నాడు. కొబ్బరి చిప్పతో తయారు చేసుకున్న మాస్క్ ధరించి పార్కింగ్ లాట్‌లో విజిల్ ఊదుతున్న ‘నేంగా బుడియాసా’ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇదే విషయంపై బుడియాసా స్పందిస్తూ.. ‘డ్యూటీలో భాగంగా విజిల్ వేయాల్సి వచ్చినప్పుడల్లా మాస్క్ తీయడం ఇబ్బందిగా ఉంది. అంతేకాదు ఇలాప్రతిసారి మాస్కును తీయడం వలన మురికిగా మారిపోతుంది.. ఇదే విషయంపై చాలామంది కస్టమర్స్ కంప్లైంట్ కూడా చేశారు. అందుకనే తాను కొబ్బరి చిప్పను మాస్క్ గా ధరించానని చెప్పాడు. అయితే ఈ కొబ్బరి చిప్ప మాస్క్ పోలీసుల దృష్టికి ఈ విషయం చేరింది.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నేంగా బుడియాసా కరోనా వైరస్ నియంత్రణకు సంబందించిన నియమాలను పాటించడం లేదని శిక్ష విధించారు. బుడియాసాతో పుష్-అప్స్ చేయించి మందలించి వదిలేశారు. ఇదే విషయంపై సంబంధిత అధికారి స్పందిస్తూ.. నిజానికి నేంగా బుడియాసా ఎటువంటి రూల్స్ అతిక్రమించలేదని.. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాస్క్‌ను ధరించడం లేదు కనుక అతనికి నామమాత్రపు శిక్ష వేసి వదిలేశామని.. అంతేకాదు అతనికి మాస్కులు ఇచ్చామని తెలిపారు.

 

Also Read: Vidura Niti: మనిషి లోభం విడిచి..మనసు అదుపులో పెట్టుకోవాలి… మేలు చేసిన వాడికి కీడు చేస్తే వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు..