
డాలర్‌డ్రీమ్స్. న్యూయార్క్ నగరం నడిబొడ్డున కాఫీ తాగలన్న కోరిక. కాలిఫోర్నియా తీరంలో సరదాగా సేదదీరాలన్న ఆశ. డాలస్‌లో ఇల్లుకట్టుకొని సెటిల్ అయిపోవాలన్న పట్టుదల. ఈ డ్రీమ్స్‌లో బతికే ఎంతోమంది అమెరికావైపు పరుగులు తీస్తుంటారు. స్థోమత ఉన్నవారు అక్కడి కాలేజీల్లో చేరి.. ఆతర్వాత అక్కడే ఉండిపోయే మార్గాలన్నీ అణ్వేషించి చివరకు సక్సెస్ అవుతారు. ఇంకొందరు జాబ్ సంపాదించి వర్కింగ్ వీసా దక్కించుకుని వెళ్లిపోవాలనుకుంటుటారు. ఈ రెండూ కలిసిరానివారు అక్రమ మార్గంలో అయినా సరే.. వెళ్లిపోయి ఎక్కడో దగ్గర తలదాచుకుని చివరికి అక్కడ పౌరుడిగా నిలవాలని చూస్తుంటారు. ఇప్పుడు వీళ్లందరికీ ట్రంప్ రూపంలో బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని వెతికి పట్టుకుని ఇండియా పంపించేయాలని చూస్తున్నారు. స్టూడెంట్స్‌పై నిఘా పెరిగింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తుంటే వారినీ వదలడంలేదు. ఇక అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగులనూ ఎయిర్‌పోర్టులోనే నిలిపేస్తున్నారు. ట్రంప్ రూలింగ్ భారతీయులకు సంకటంగా మారింది.
H1b వీసా ఉన్నా అనుమతులను నిరాకరిస్తున్నారు. ఆఫర్‌లెటర్ ఉన్నా, వీసా స్టాంపింగ్ పడినా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈనెల 12న నెవార్క్ ఎయిర్‌పోర్టులో H1b వీసా స్టాంపింగ్‌తో దిగిన ఓ ఉద్యోగిని అన్యాయంగా డిపోర్ట్ చేశారు. ఆఫర్‌లెటర్ వచ్చిన రోజు నుంచి వీసా స్టాంపింగ్ పడడం ఆతర్వాత అమెరికా రాడానికి సమయం పట్టడంతో ఇన్ని రోజులు ఏం చేశావని నిలదీశారు. ఆతర్వాత ఐసోలేటెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి ప్రశ్నలతో వేధించారు. అనంతరం ఉద్యోగం ఇచ్చిన ఎంప్లాయర్‌కు ఫోన్ చేసి 40 నిమిషాలుపాటు వారితో మాట్లాడి.. జాబ్ తీయించేశారు. చివరకు అమెరికాలోకి ఎంటర్ అవ్వకుండానే వెనక్కిపంపేశారు అక్కడి అధికారులు.
మరోవైపు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇల్లీగల్ ఇమిగ్రాంట్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ప్రామిస్ ఇచ్చారు. అక్రమంగా అమెరికాలో ఉంటే వెంటనే అరెస్టులు చేయడమో.. డిపోర్ట్ చేయడమో జరుగుతోంది. ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ కూడా అమెరికా ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అక్రమంగా ఉండే వారిని వెనక్కి తీసుకుంటామంటున్నారు.
ఇప్పటివకు 7లక్షల 25వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది అక్కడి ప్రభుత్వం. వారిలో 18వేల మందితో తొలి జాబితా తయారుచేసింది. ఈ డేటాను భారత ప్రభుత్వంతో షేర్ చేస్తే.. వారందర్నీ తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా నుంచి భారత్‌కు మళ్లుతున్న డబ్బు వ్యవహారాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంది అమెరికా సర్కార్. యూఎస్ నుంచి భారీ మొత్తంలో వచ్చే నిధుల వివరాలను అమెరికాతో షేర్ చేసుకుంటోంది. ఇది స్టూడెంట్స్‌కు చాలా ప్రమాదకరంగా మారుతోంది. అమెరికా నుంచి భారత్‌కు నిధులు పంపితే అక్కడ సెండర్స్.. ఇక్కడ బెనిఫీషరీ వివరాలు సరిచూసుకుంటున్నారు. ఈ జాబితాలో విద్యార్థులు కాని.. వారి కుటుంబాలు కాని ఉంటే వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు.
నిజానికి ఇలా అమెరికా నుంచి డాలర్లు వెళ్తున్న దేశాల్లో మెక్సికో తర్వాత భారతీయులే ఎక్కువగా ఉన్నారు. 2023లో 111బిలియన్ డాలర్లు భారత్‌లోని వ్యక్తులకు మళ్లినట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అమెరికాకు సహకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి