షాపింగ్‌కు వెళ్లిన జంటపై బుల్లెట్ల వర్షం.. కెనడాలో ఇద్దరు భారతీయుల హతం!

కెనడాలో భారత సంతతికి చెందిన యువ జంట దారుణ హత్యకు గురయ్యారు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ స్థలంలో గుర్తుతెలియని దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 ఏళ్ల యువకుడు, అతడి 24 ఏళ్ల స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యలు నేరాలతో సంబంధం ఉన్న లక్షిత దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

షాపింగ్‌కు వెళ్లిన జంటపై బుల్లెట్ల వర్షం.. కెనడాలో ఇద్దరు భారతీయుల హతం!
Couple Shot Dead

Updated on: Nov 21, 2026 | 7:46 PM

కెనడాలో భారత సంతతికి చెందిన యువ జంట దారుణ హత్యకు గురయ్యారు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ స్థలంలో గుర్తుతెలియని దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 ఏళ్ల యువకుడు, అతడి 24 ఏళ్ల స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యలు నేరాలతో సంబంధం ఉన్న లక్షిత దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

వాల్‌మార్ట్ పార్కింగ్‌లో రక్తపాతం..!

వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 15వ తేదీ రాత్రి సర్రేలోని 88 అవెన్యూ, 124 స్ట్రీట్ సమీపంలో ఉన్న వాల్‌మార్ట్ పార్కింగ్ స్థలంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10.38 గంటలకు ఓ పురుషుడు, మహిళ తుపాకీ గాయాలతో పడి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

మృతులు ఎవరు?

మృతులను డెల్టా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల గగన్‌ప్రీత్ (గ్యారీ) రెహల్, 24 ఏళ్ల సుఖ్‌జీత్ కౌర్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ భారత సంతతికి చెందినవారని సమాచారం. రెహల్ గతంలో ఆయుధాలకు సంబంధించిన నేరాల్లో పోలీసులకు పరిచయమున్న వ్యక్తి కాగా, సుఖ్‌జీత్ కౌర్‌కు కెనడాలో తెలిసిన నేర సంబంధాలు పరిమితంగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

కాల్పుల తర్వాత కారుకు నిప్పు..!

ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరిగిన సుమారు 15 నిమిషాల తర్వాత, రాత్రి 10.51 గంటలకు ప్రిన్సెస్ డ్రైవ్‌లోని 9700 బ్లాక్‌లో ఓ వాహనం మంటల్లో కాలిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ వాహనాన్ని కాల్పులకు పాల్పడిన నిందితులు ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు దొరకకుండా చేసేందుకే కారును తగలబెట్టారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

కొడుకును కోల్పోయిన తండ్రి ఆవేదన..

ఈ ఘటనతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. తన కుమారుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఈ దారుణం జరిగిందని గగన్‌ప్రీత్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాల్గరీ నుంచి ట్రక్ నడుపుకుంటూ తిరిగి వస్తుండగా కాల్పుల సమాచారం అందిందని, అప్పటికే తన కుమారుడు చనిపోయాడనే వార్త విన్నానని కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడి మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో కూడా తెలియడం లేదని, చివరిసారిగా కుమారుడిని చూడాలనుకుంటున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు హృదయవిదారకంగా మారాయి.

ప్రస్తుతం ఈ కేసును కెనడాకు చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT), సర్రే పోలీస్ సర్వీస్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. వాల్‌మార్ట్ పార్కింగ్ స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ జంటను ఎవరు హత్య చేశారు? ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అరెస్టులు ప్రకటించలేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us