Airbag Jeans: త్వరలో మార్కెట్లోకి ఎయిర్ బ్యాగ్ జీన్స్.. బైక్ పై జర్నీ సేఫ్.. ఎలాగో తెలుసా..!

ప్రపంచ దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా రోడ్డు ప్రమాదాల్లో నమోదవుతున్నాయి. ఇక మనదేశం, అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాల్లో బైక్ యాక్సిడెంట్ మరణాలు ఎక్కువే...

Airbag Jeans: త్వరలో మార్కెట్లోకి ఎయిర్ బ్యాగ్ జీన్స్.. బైక్ పై జర్నీ సేఫ్.. ఎలాగో తెలుసా..!
Follow us

|

Updated on: Feb 02, 2021 | 1:23 PM

Airbag Jeans: ప్రపంచ దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా రోడ్డు ప్రమాదాల్లో నమోదవుతున్నాయి. ఇక మనదేశంలో అయితే సగటున ప్రతిరోజూ 1,230 రోడ్డు ప్రమాదాలు జరిగేతే 414 మరణాలు నమోదవుతున్నాయని అధికారిక లెక్కలు.. అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాల్లో బైక్ యాక్సిడెంట్ మరణాలు ఎక్కువే. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినా ప్రాణాపాయాన్ని తప్పించుకునేందుకు కార్లకు ఎయిర్ బ్యాగ్స్ సౌకర్యాన్ని ఆవిష్కరించారు. దీంతో కారు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గింది. ఇక బైక్ మీద ప్రయాణిస్తున్న సమయంలో అయితే హెల్మెట్ మనల్ని రక్షిస్తుంది.. అయితే అది సంపూర్ణంగా కాదు.. ఒక్క తలకు.. మెదడుకు మాత్రమే రక్షణమాత్రమే ఇస్తుంది.. దీంతో ఒక సంస్థ బైక్ పై ప్రయాణించే వారి రక్షణ కోసం సరికొత్తగా ఎయిర్ బ్యాగ్ జీన్స్ ను తయారు చేస్తోంది.

స్వీడన్ కు చెందిన “ఎయిర్ బ్యాగ్ ఇన్‌సైడ్ స్వీడన్ ఎబి” అనే సంస్థ ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ను తయారు చేస్తోంది. వీటిని ధరిస్తే ప్రయాణంలో అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలను రక్షించుకోవచ్చని తెలిపింది. నిజానికి ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ప్రయోగం 16 ఏళ్ల క్రితమే చేశారు.. అప్పుడు ఆ జీన్స్‌లో తోలు పొరమాత్రమే ఉండేది.. ఇప్పుడు దానిని ఆధునిక టెక్నాలజీతో మరింత డవలప్ చేసి సూపర్ స్ట్రాంగ్ జీన్స్ ప్రోటో టైప్‌ను తయారు చేశారు.

ఇవి ధరించి బైక్ డ్రైవ్ చేసిన వ్యక్తులకు అనుకోకుండా ప్రమాదం జరిగితే ఎయిర్ బ్యాగ్స్ తెరచుకుని వాటిల్లోకి గాలివస్తుంది. దీంతో శరీరం కిందపడినా తీవ్ర స్థాయిలో గాయపడరు. శరీరానికి హాని కాదు. ఈ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను యూరోపియన్ హెల్త్, స్టాండర్ట్స్ నుంచి ధృవీకరణ పొందాల్సి ఉందని రూపకర్త షహ్రీవర్ తెలిపారు. అంతేకాదు.. ఈ కొత్త ఆవిష్కరణతో బైక్‌పై ప్రయాణించే వారికీ మరింత సురక్షితమని తెలిపారు. శరీరంలోని అన్ని అవయవాలకు ముఖ్యంగా దిగువ అన్ని భాగాలకు రక్షణ కలిపించే పరికరాన్ని రూపొందించడం ఇదే మొదటిసారన్నారు. పరీక్ష అనంతరం మార్కెట్లోకి విడుదల చేయనున్నామని చెప్పారు.

ఈ జీన్స్ అభివృద్ధి కోసం కంపెనీ… యూరోపియన్ యూనియన్ నుంచి రూ.1,31,37,750 సమీకరించింది. 2022లో ఈ జీన్స్‌ మార్కెట్లోకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Also Read:

ప్రపంచవ్యాప్తంగా క్రమంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే…

 మీరు మాంసాహార ప్రియులా.. 3 నెలలు శాఖాహారులుగా మారితే.. 50లక్షల బహుమతి.. ఎక్కడో తెలుసా..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు