రియాద్‌లో బాంబుల మోత.. ఎయిర్‌పోర్టుపై బాలిస్టిక్ మిసైల్ దాడి.. ఎగిసిపడుతున్న పొగలు!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీలు గురువారం (అక్టోబర్ 08) రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు ప్రకటించారు. దాడి అనంతరం రియాద్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించగా.. విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఓ విమానం నుంచి పొగలు పైకి లేచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.

రియాద్‌లో బాంబుల మోత.. ఎయిర్‌పోర్టుపై బాలిస్టిక్ మిసైల్ దాడి.. ఎగిసిపడుతున్న పొగలు!
Riyadh Airport

Updated on: Oct 08, 2026 | 6:48 PM

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీలు గురువారం (అక్టోబర్ 08) రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు ప్రకటించారు. దాడి అనంతరం రియాద్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించగా.. విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఓ విమానం నుంచి పొగలు పైకి లేచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ ఘటనతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ తమ బలగాలు కింగ్ ఖాలిద్ విమానాశ్రయాన్ని బాలిస్టిక్ క్షిపణితో లక్ష్యంగా చేసుకున్నాయని ప్రకటించారు. క్షిపణి లక్ష్యాన్ని చేరుకుని విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా సౌదీ గగనతలాన్ని లక్ష్యంగా చేసుకునే దాడులు కొనసాగుతాయని హౌతీలు హెచ్చరించారు. అంతర్జాతీయ విమానయాన సంస్థలు సౌదీ గగనతలంలో కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు.

అయితే ఈ దాడిపై సౌదీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి ధృవీకరణ రాలేదు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రియాద్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి. అంతకుముందు జరిగిన దాడుల్లో రియాద్, అభా విమానాశ్రయాలపై దాడులు జరగగా.. ముగ్గురు మరణించారని, మరో 36 మంది గాయపడ్డారని సౌదీ అధికారులు తెలిపారు.

తాజా దాడుల నేపథ్యంలో రియాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం సూచించింది. నగరంలోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో పనిచేస్తున్న కొన్ని బహుళజాతి సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించినట్లు రాయిటర్స్ పేర్కొంది. భద్రతా హెచ్చరికల నేపథ్యంలో కొన్ని పాఠశాలలు, దౌత్య కార్యాలయాలు కూడా అప్రమత్తమైనట్లు తెలిపింది.

మరోవైపు, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై ఎదురుదాడులు ప్రారంభించాయి. నాలుగు ప్రావిన్సుల్లో 82 హౌతీ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు సంకీర్ణ దళాలు ప్రకటించాయి. వీటిలో బాలిస్టిక్ క్షిపణుల నిల్వ కేంద్రాలు, కమాండ్‌ సెంటర్లు, ఆయుధ డిపోలు ఉన్నట్లు తెలిపాయి.

ఇటీవల యెమెన్‌లో సౌదీ మద్దతుగల ప్రభుత్వ బలగాలు, హౌతీల మధ్య పోరాటం మళ్లీ తీవ్రం కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బాబ్ ఎల్-మండేబ్ జలసంధి చుట్టూ జరుగుతున్న పోరాటం వాణిజ్య, చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజా ఘర్షణల్లో ఇప్పటికే సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us