అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధాన ఆర్థికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపినాథ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆమె మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఈ మధ్యే పదోన్నతి పొందారు. ఆమె జనవరి 21, 2022న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
గీతా గోపినాథ్ వచ్చే ఏడాదిలో ఐఎంఎఫ్‌ను వీడి.. హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జియోఫ్రే ఒకమోటో వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గీతను ఆ ఉన్నత పదవికి ఐఎంఎఫ్ బోర్డు సిఫార్సు చేసింది. 49 ఏళ్ల గోపినాథ్ వాషింగ్టన్‌కు చెందిన గ్లోబల్ లెండర్‌కు మూడేళ్లపాటు చీఫ్ ఎకనామిస్ట్‌గా సేవలందించిన మొదటి మహిళగా నిలిచారు.
Chief Economist of the IMF, @GitaGopinath called on PM @narendramodi. pic.twitter.com/2B30CMvjja
— PMO India (@PMOIndia) December 15, 2021
Read Also.. NRI: ఎన్నారైల కోసం విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన పంజాబ్.. సింగిల్ విండో పద్ధతిలో వ్యాపారానికి అనుమతి..