గాల్లో ఉండగా ఫైలట్ల మధ్య కొట్లాట.. ఒక్కసారిగా 15 వేల అడుగులకు పడిపోయిన విమానం!

దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో గాల్లో అత్యవసర సంకేతం హైజాక్ కోడ్ రావడంతో కలకలం రేగింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు పర్యవేక్షించగా, సౌదీలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. హైజాక్ కాదని తేలినా, సిబ్బంది మధ్య ఘర్షణే కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

గాల్లో ఉండగా ఫైలట్ల మధ్య కొట్లాట.. ఒక్కసారిగా 15 వేల అడుగులకు పడిపోయిన విమానం!
Flydubai Flight Emergency

Updated on: Sep 30, 2026 | 1:07 PM

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం (సెప్టెంబర్ 30) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విమానం అత్యవసర సంకేతాన్ని పంపడంతో హైజాక్ జరిగిందన్న అనుమానాలు తలెత్తాయి. దీంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది హైజాక్ కాదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలో ఉండగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. విమానం మార్గాన్ని మార్చుకుని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు సమాచారం. ఘటన సమయంలో విమానం నుంచి హైజాక్‌కు సంబంధించిన అత్యవసర కోడ్ ప్రసారం కావడంతో భద్రతా సంస్థలు వెంటనే స్పందించాయి.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్ వైపు నుంచి ఫైటర్ జెట్లు విమానాన్ని పర్యవేక్షించాయి. అయితే విమానంలో వాస్తవంగా హైజాక్ జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. తాజా సమాచారం ప్రకారం విమాన సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ లేదా వాగ్వాదమే అత్యవసర సంకేతానికి కారణమై ఉండొచ్చని సౌదీ భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఈ అంశంపై పూర్తి అధికారిక దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

ఈ ఘటనతో కొంతసేపు తీవ్ర భద్రతా ఆందోళన నెలకొన్నప్పటికీ, విమానం సురక్షితంగా మళ్లించబడటంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలువరిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us