Ebola Health Update : మానవులపై పంజా విసురుతున్న మరో ప్రాణాంతక వైరస్.. పలు దేశాలను అలెర్ట్ చేసిన డబ్ల్యూహెచ్ఓ

ఓ వైపు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది.. ఈ వైరస్ ఇంకా కనుమరుగు కాకముందే మళ్ళీ మరో ప్రాణాంతక వైరస్ పురులువిప్పిందని తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పంజా విసురుతుంది. గినియాలో ..

Ebola Health Update : మానవులపై పంజా విసురుతున్న మరో ప్రాణాంతక వైరస్.. పలు దేశాలను అలెర్ట్ చేసిన డబ్ల్యూహెచ్ఓ

Updated on: Feb 18, 2021 | 3:21 PM

Ebola Health Update : ఓ వైపు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది.. ఈ వైరస్ ఇంకా కనుమరుగు కాకముందే మళ్ళీ మరో ప్రాణాంతక వైరస్ పురులువిప్పిందని తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పంజా విసురుతుంది. గినియాలో ఈ వైరస్ బారిన పడిన ఇప్పటికే ఐదుగురు మరణించారు. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వైరస్ మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికాలోని మరో ఆరు దేశాలను అలర్ట్ చేసింది.

గినియాలో 109 కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. ఇక మరోవైపు కాంగో దేశంలోనే ఇప్పటివరకు 300 ఎబోలా కేసులను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ తెలిపారు. వీటితో పాటు మరో రెండు దేశాల్లోనూ ఎబోలా కేసులు గుర్తించినట్లు సమాచారం. వాటి మూలాలను తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షిస్తున్నామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

Also Read:

ఐపీఎల్ మినీ వేలానికి వేళాయె.. బరిలో 292 ప్లేయర్స్.. పోటుగాళ్లు ఎవరో చూడాలి మరి.!

  మెగాస్టార్ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌కు బయలుదేరిన ‘సిద్ద’… వైరల్ అవుతున్న రామ్‌‌‌‌‌‌చరణ్ ఫోటోలు..

Loading...
Unable to load recommendations.
Follow Us