Mayushi Bhagath: అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపులు.. పట్టుకున్న వారికి రూ.8.32 లక్షల రివార్డ్

అమెరికా అనగానే పెద్ద చదువుల కోసం మనవాళ్లు క్యూ కడుతూ ఉంటారు. ఈమధ్య కాలంలో వీసాపై కఠిన ఆంక్షలు విధించడంతో ప్రయాణించే వారి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది. అయితే కొన్నేళ్లుగా అమెరికాలో భారతీయ విద్యార్థిని కనిపించకుండా పోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈమె కోసం అమెరికన్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Mayushi Bhagath: అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపులు.. పట్టుకున్న వారికి రూ.8.32 లక్షల రివార్డ్
Mayushi Missing

Updated on: Dec 22, 2023 | 5:28 PM

అమెరికా అనగానే పెద్ద చదువుల కోసం మనవాళ్లు క్యూ కడుతూ ఉంటారు. ఈమధ్య కాలంలో వీసాపై కఠిన ఆంక్షలు విధించడంతో ప్రయాణించే వారి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది. అయితే కొన్నేళ్లుగా అమెరికాలో భారతీయ విద్యార్థిని కనిపించకుండా పోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈమె కోసం అమెరికన్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈమె గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక భారతీయ విద్యార్థిని అగ్రరాజ్యం అమెరికాలో నాలుగేళ్లుగా కనిపించడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెతుకులాట ప్రారంభించింది.

ఆమె పేరు మయూషి భగత్‌, భారతీయ విద్యార్థిని.. స్టూడెంట్‌ వీసా మీద అమెరికాకు వెళ్ళారు. 29 ఏళ్ల మయూషి న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో చదువు కొనసాగించే వారు. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన ఘటన చోటు చేసుకుంది. గత నాలుగేళ్ల నుంచి కనిపించడం లేదు. అంటే.. 2019 మే 1న న్యూజెర్సీలో కనిపించకుండాపోయారు. ఆమె చివరిసారిగా తాను నివసిస్తున్న అపార్ట్మెంట్లోని స్థానికులతో 2019 ఏప్రిల్‌ 29 నమాట్లాడారు. ఆరోజు పైజామా ప్యాంట్‌ నల్ల టీషర్టు ధరించి ఉన్నట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. ఎలాంటి సమాచారం లేదు.

ఎంతకూ స్పందన లేకపోవడంతో మయూషి కుటుంబ సభ్యులు ఆమె మే 1 నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అమెరికన్ పోలీసులు మయూషి కోసం తీవ్రంగా వెతుకున్నప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో గతేడాది పోలీసులు ఆమెను మిస్సింగ్‌ వ్యక్తుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె ఆచూకీపై విచారణ ఇంకా కొనసాగుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఈ కేసుపై విచారణ కొనసాగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మయూషి భగత్‌ ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల బహుమతిని అందిస్తామని ప్రకటించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.8.32 లక్షల రివార్డు ఇస్తారనమాట. ఎఫ్‌బీఐ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూషి మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలదని వెల్లడించారు. న్యూజెర్సీలోని సౌత్‌ ప్లెయిన్‌ఫీల్డ్‌‌లో స్నేహితులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మయూషి వివరాలను అధికారులు బయటకు వెల్లడించారు. ఆమె కళ్లు గోధుమ రంగులో ఉంటాయని, జుట్టు నల్లగా ఉంటుందని, ఎత్తు 5.10 అడుగులు ఉంటుందని తెలిపారు. ఎఫ్‌బీఐ తన వెబ్‌సైట్‌‌లో మోస్ట్‌ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో మయూషి పేరును చేర్చింది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..