
సరిగ్గా ఏడాది కిందట ఇజ్రాయెల్ వరసబెట్టి భీకర దాడులు చేస్తుంటే గాజా ప్రాంతం చితికిపోతుంటే, ఎక్కడో ఉన్న యూరప్ ఖండం తల్లడిల్లింది. యూదు వ్యతిరేకులు, పాలస్తీనా సానుభూతిపరులు ఒక్కతాటిమీదకొచ్చి, యూరోపియన్ సిటీస్ అంతటా రోడ్డెక్కి రచ్చరచ్చ జేశారు. రెండేళ్లలో 67 వేలమందిని చంపి, గాజాను శిథిలావస్థకు చేర్చినందుకు ఇజ్రాయెల్‌పై భగ్గుమన్నారు. వేలమంది జైలుపాలయ్యారు కూడా. కానీ, అది తమదికాని గాజా గడ్డకు సంఘీభావం చెబుతూ చేసిన గొడవ. కానీ, ఇప్పుడైతే పక్కా లోకల్. సొంత ఈతి బాధల నుంచి విముక్తి కోసం పోరుబాట పట్టింది ఐరోపా దేశాల్లో పీడిత జనం. వీళ్లకు ఊతకర్రగా నిలబడింది ఉడుకునెత్తురున్న నవ యువతరం. ఫలితం ఏంటంటే, రావణకాష్టంలా మండుతోంది సగానికిపైగా ఐరోపా ఖండం. లిమోజెస్ రాజ భవనం.. ఫ్రెంచ్‌లోని హిస్టారికల్ టౌన్‌హాల్.. నిన్నమొన్నటిదాకా వరల్డ్ క్లాస్ టూరిస్ట్ స్పాట్.. 1876 నుంచి ఫ్రాన్స్ వింటేజ్ కల్చర్‌కి కేరాఫ్‌నంటూ నిటారుగా నిలబడింది. ఇప్పుడు… ఇలా కుప్పకూలిపోయింది. 143 ఏళ్ల పాటు ప్రపంచ యుద్ధాలను కూడా తట్టుకుని గట్టిగా నిలబడ్డ పురాతన భవనం. మోడ్రన్ ఫ్రాన్స్‌కి మాత్రం తడబడింది. నిరసన మంటల్లో పడి మాడి మసైపోయింది. లిమోజెస్ బిల్డింగ్, బూడిదవ్వక ముందు, బూడిదైన తర్వాత అంటూ రెండు దృశ్యాలనూ చూసుకుని గొల్లుమంటోంది ఫ్రాన్స్. ఫ్రాన్స్‌లో ఇటువంటి...