పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్‌ – అమెరికా కీలక చర్చలు.. మోదీ – ట్రంప్‌ మధ్యలో మస్క్‌..?

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసిన చర్చలు జరిపారు. ఈ సంభాషణలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారని న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రచురించింది. మార్చి 24న ఫోన్‌లో మోదీ, ట్రంప్‌ చర్చలు చర్చించారు. అయితే రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య జరిగే సంభాషణలో ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం అసాధారణం.

పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్‌ - అమెరికా కీలక చర్చలు.. మోదీ - ట్రంప్‌ మధ్యలో మస్క్‌..?
Pm Modi, Donald Trump, Elon Musk

Updated on: Mar 28, 2026 | 11:51 AM

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసిన చర్చలు జరిపారు. ఈ సంభాషణలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారని న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రచురించింది. మార్చి 24న ఫోన్‌లో మోదీ, ట్రంప్‌ చర్చలు చర్చించారు. అయితే రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య జరిగే సంభాషణలో ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం అసాధారణం అంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో తెలిపింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ట్రంప్ – మోదీ సంభాషణలో మధ్యప్రాచ్యంలోని పరిస్థితి గురించి, ముఖ్యంగా ప్రపంచ చమురు, గ్యాస్‌కు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి గురించి చర్చించారు. అయితే, ఈ సంభాషణలో ఎలాన్ మస్క్‌ను ఎందుకు చేర్చారు.దా ఆయన ఎంతవరకు పాల్గొన్నారు అనే విషయంపై స్పష్టత లేదు. గతంలో డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మస్క్‌, ఆ తర్వాత ఆయనకు దూరం అయ్యారు. అయితే ట్రంప్‌, మస్క్‌ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఈ ఫోన్‌కాల్‌ సంభాషణ నిదర్శనమని అమెరికా పత్రిక వివరించింది.

మస్క్ రాక, మోదీ – ట్రంప్‌ మధ్య సంబంధాలు మెరుగుపడటానికి ఒక సంకేతం కావచ్చని న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. గత సంవత్సరం, వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మస్క్ అంతరిక్షం, ఇంధనం, సాంకేతికత రంగాలలో పాలుపంచుకుంటున్నారు. ఇవి గల్ఫ్ దేశాలు, భారతదేశం వంటి ప్రాంతాలపై ప్రభావం చూపుతాయి. మస్క్ భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నారని, శాటిలైట్ ఇంటర్నెట్ వంటి సేవలకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.

ఇదిలావుంటే, ట్రంప్ – మోదీ ఇద్దరూ తమ సంభాషణలో హోర్ముజ్ జలసంధి భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ మార్గం భారతదేశానికి చాలా కీలకమైనది. ఎందుకంటే దీని ద్వారా గణనీయమైన పరిమాణంలో చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంభాషణను ఉపయోగకరమైనదిగా అభివర్ణించారు. మధ్య ప్రాచ్యంలో శాంతిని కాపాడటానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. హోర్ముజ్ మార్గానికి ఎలాంటి ఆటంకం కలిగించడం ఆమోదయోగ్యం కాదని, ఎందుకంటే అది వాణిజ్యం, చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాపై ప్రభావం చూపుతుందని ప్రదాని మోదీ పార్లమెంటులో తెలిపారు. ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు దారితీసింది. అనేక దేశాలలో సరఫరాపై ఆందోళనలను పెంచింది. అయితే, ప్రధాని మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన సంభాషణలో మస్క్ పాత్రకు సంబంధించి వైట్ హౌస్ గానీ, భారత ప్రభుత్వం గానీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని అందించలేదు. అంతేకాకుండా, ఎలాన్ మస్క్ కూడా ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us