జైలు లోపల తచ్చాడుతూ కనిపించిన పిల్లి.. అనుమానంతో దగ్గరకెళ్లి చూస్తే మైండ్‌బ్లాక్..!

రష్యాలో వెలుగులోకి వచ్చిన ఓ విచిత్ర ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశారు. ఓ అమాయక పిల్లిని మాధ్యమంగా ఉపయోగించి జైలులోని ఖైదీలకు మత్తుపదార్థాలు చేరవేయాలని ప్రయత్నించారు. అయితే జైలు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో వారి కుట్ర విఫలమైంది.

జైలు లోపల తచ్చాడుతూ కనిపించిన పిల్లి.. అనుమానంతో దగ్గరకెళ్లి చూస్తే మైండ్‌బ్లాక్..!
Cat Drug Smuggling

Updated on: Jul 25, 2026 | 4:57 PM

రష్యాలో వెలుగులోకి వచ్చిన ఓ విచిత్ర ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశారు. ఓ అమాయక పిల్లిని మాధ్యమంగా ఉపయోగించి జైలులోని ఖైదీలకు మత్తుపదార్థాలు చేరవేయాలని ప్రయత్నించారు. అయితే జైలు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో వారి కుట్ర విఫలమైంది.

ఈ ఘటన రష్యాలోని నిజ్నీ నొవ్‌గోరోడ్ ప్రాంతంలో ఉన్న కరెక్షనల్ కాలనీ నెం.17లో చోటుచేసుకుంది. సాధారణ గస్తీ నిర్వహిస్తున్న జైలు గార్డులు జైలు ప్రాంగణం వైపు నెమ్మదిగా వస్తున్న ఓ పిల్లిని గమనించారు. తొలుత సాధారణ వీధి పిల్లిగానే భావించినా, దాని మెడకు రెండు గుడ్డ పట్టీలు కట్టి ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పిల్లిని సురక్షితంగా పట్టుకున్న అధికారులు ఆ పట్టీలను తొలగించి పరిశీలించారు. వాటి లోపల నిషేధిత మత్తుపదార్థాలు దాచి ఉంచినట్లు గుర్తించారు. అనంతరం వాసన పసిగట్టే శునకంతో పరీక్షించగా అవి నిజంగానే మాదకద్రవ్యాలేనని నిర్ధారణ అయింది.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, జైల్లోని ఖైదీలకు ఈ మత్తుపదార్థాలను అందించేందుకు స్మగ్లర్లు పిల్లిని వినియోగించాలని పథకం రచించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పిల్లులు గోడలు, పొదలు, ఇరుకైన మార్గాల గుండా సులభంగా వెళ్లగలవన్న విషయాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఎత్తుగడ వేసినట్లు భావిస్తున్నారు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతతో మత్తుపదార్థాలు జైలు లోపలికి చేరకముందే స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం పిల్లికి ఎలాంటి హాని జరగకుండా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రష్యా ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ (FSIN) వెల్లడించింది. అది పూర్తిగా క్షేమంగా ఉందని నిర్ధారించిన తర్వాత విడుదల చేసినట్లు తెలిపింది.

ఈ ఘటనలో పిల్లికి ఎలాంటి సంబంధం లేదని, నేరస్థులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానిని ఉపయోగించుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పిల్లిని ఎవరు సిద్ధం చేశారు, మత్తుపదార్థాలు ఎవరికి చేరవేయాలనుకున్నారు, ఈ కుట్ర వెనుక ఎంతమంది ఉన్నారనే కోణాల్లో పోలీసులు, జైలు అధికారులు సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us