California Flash Floods: క్రిస్మస్ పర్వదినాన ప్రకృతి విశ్వరూపం.. కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

క్రిస్మస్ పర్వదినాన అమెరికాలో ప్రకృతి విశ్వరూపం చూపించింది. కాలిఫోర్నియా రాష్ట్రన్ని వర్షాలు, వరదల ముంచెత్తాయి. తుఫాన్ కారణంగా ఈదురు గాలులతో కూడి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగాయి. పర్వత ప్రాంతాల నుంచి దూసుకొచ్చిన మెరుపు వరద రాష్ట్రాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ఈ వరదల కారణంగా పలు మరణాలు కూడా సంభవించాయి.

California Flash Floods: క్రిస్మస్ పర్వదినాన ప్రకృతి విశ్వరూపం.. కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
California Christmas Floods

Updated on: Dec 27, 2025 | 9:48 AM

క్రిస్మస్ పర్వదినాన అమెరికాలో ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. కాలిఫోర్నియా రాష్ట్రన్ని తుఫాన్ ముంచెత్తింది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో బలమైన ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు కురవడంతో దక్షిణాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు మెరుపు వేగంలో నగరాల్లోకి దూసుకొచ్చాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో నివాసాలు ధ్వంసం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం నీట మునిగాయి. భారీ వరదల కారణంగా హిల్‌ రిసార్ట్ కట్టడాలు నీటిలో కొట్టుకుపోయాయి.

ఇక లాస్‌ ఏంజెలెస్‌కు ఈశాన్యంగా 80 మైళ్ల దూరంలో ఉన్న శాన్‌ గాబ్రియేల్‌ పర్వత ప్రాంతంలోని రోడ్లు మొత్తం బురదగా మారడంలో పలు వాహణాలు చిక్కుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా శాన్‌డియాగోలో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందగా, శాక్రమెంటోలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. దీంతో
కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్ గెవిన్ న్యూసమ్.

స్థానికంగా ఉన్న ప్రజలు వెంటనే తమ నివాసాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులకు అదేశాలు జారీ చేశారు. తుఫాన్ తీవ్ర తగ్గేవరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రకృతి వైపరిత్యం కారణంగా భారీ ఆస్తనష్టం జరిగినట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.