
‘రెట్టింపు ముప్పు’.. కోట్ చేసి మాట్లాడుకోవాల్సిన వార్నింగ్ ఇది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ విషయమై పెద్ద హెచ్చరికే చేసింది. 1970ల నాటి చమురు సంక్షోభం కంటే ఈ ఏప్రిల్, మేలో రాబోయే క్రైసిస్ అత్యంత భయంకరంగా ఉండబోతోందని చెప్పింది. ఇప్పటివాళ్లకి 1970 నాటి ఆయిల్ క్రైసిస్ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు. ఆనాడు బ్యారెల్ క్రూడాయిల్ ఏకంగా 400 పర్సెంట్ పెరిగింది. అమెరికా, యూరప్‌లలో పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ కార్లు క్యూ కట్టి ఉండేవి. కార్ నెంబర్ ప్లేట్ చివరి అంకెను బట్టి ఏ రోజు పెట్రోల్ పోయించుకోవాలో ప్రభుత్వాలు నిర్ణయించేవి. గన్ ఫైరింగ్, హింసాత్మక ఘటనలు జరగని రోజు లేదు ఆరోజుల్లో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సో, ‘రెట్టింపు ముప్పు’ అనే వార్నింగ్‌కు అర్థం.. 1970 నాటి సంక్షోభాన్ని మించి ఉండబోతోందని. IEA ఓ అనాలసిస్ చేసింది. ఆ విశ్లేషణ ప్రకారం ఈ ఏప్రిల్‌లో రెండు ప్రధాన సమస్యలు ఏకకాలంలో దాడి చేయబోతున్నాయి. ఒకటి.. సప్లై షాక్. సరఫరా గొలుసు తెగిపోవడం. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి, అటు ఎర్ర సముద్రం మార్గాలు దాదాపు మూతపడ్డాయి. దీనివల్ల ప్రతిరోజూ సుమారు రెండున్న కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా...