Watch Video: తృటిలో తప్పిన పెనుప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన కార్గో విమానం.. వీడియో

|

Apr 08, 2022 | 10:19 AM

Cargo Plane Skids Off Runway: విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైంది. కోస్టారికాలోని శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో

Watch Video: తృటిలో తప్పిన పెనుప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన కార్గో విమానం.. వీడియో
Plane Crash
Follow us on

Cargo Plane Skids Off Runway: విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైంది. కోస్టారికాలోని శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో కార్గో విమానం రన్‌వేపై నుంచి జారిపోయి.. సగానికి విరిగి రెండుముక్కలైంది. దీంతో విమానాశ్రయాన్ని శుక్రవారం తాత్కాలికంగా మూసివేశారు. అయితే.. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు వెల్లడించారు. జర్మన్‌ డీహెచ్‌ఎల్‌కు చెందిన బోయింగ్‌ 757 కార్గో విమానం రాజధానికి పశ్చిమాన ఉన్న జువాన్ శాంటామారియా విమానాశ్రయం నుంచి నుంచి బయలుదేరింది. అయితే.. టేకాఫ్‌ అయిన 25 నిమిషాల్లోనే పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం (Costa Rica Airport) ఎయిర్‌పోర్ట్‌ అనుమతి కోరారు. విమానాశ్రయం అధికారులు ల్యాండింగ్‌కు అంగీకరించడంతో తిరిగి వెనక్కి వచ్చింది. అయితే.. అత్యవసర ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు క్షేమంగా బయటపడ్డారు.

హైడ్రాలిక్ సిస్టమ్‌లో వైఫల్యాన్ని గుర్తించిన తర్వాత ల్యాండి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. కోస్టారికా ఫైర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ హెక్టర్ చావ్స్ మాట్లాడుతూ విమానం ల్యాండింగ్ చేయగానే స్కిడ్ అయి మలుపు తిరిగి రెండుగా విరిగిపోయిందన్నారు. ఫైలెట్లు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. స్వల్పగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

కార్గో విమానంలోని సరుకు మొత్తం బయటపడినట్లు పేర్కొన్నారు. ఏదైనా ముప్పు జరిగే అవకాశం ఉందనే కారణంతో తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ ఎలాంటి ప్రమాదం జరకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. కాగా.. ఈ ఘటనపై విచారణకు అదేశించినట్లు DHL పేర్కొంది.

Also Read:

Viral Video: నవ దంపతులకు స్నేహితుల షాక్‌.. పెళ్లిలో ఏకంగా దాన్నే గిఫ్ట్‌గా ఇచ్చారు..

Warangal: దూసుకొచ్చిన ఇసుక లారీ.. ముగ్గురు మహిళా కూలీల దుర్మరణం.. ఐదుగురి పరిస్థితి..