Ottawa: కెనడా రాజధాని ఒట్టావాలో ఆందోళనలు ఉధృతం.. నిరసనకారులపై లాఠీచార్జ్..

|

Feb 21, 2022 | 10:36 PM

కెనడా రాజధాని ఒట్టావాలో ట్రక్ డ్రైవర్ల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. దీంతో దేశ రాజధానిని నిరసన కారుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు ప్రొటెస్టర్ లపై సర్కార్ ఉక్కు పాదం మోపింది. పోలీసులు రంగంలోకి దిగి..

Ottawa: కెనడా రాజధాని ఒట్టావాలో ఆందోళనలు ఉధృతం.. నిరసనకారులపై లాఠీచార్జ్..
Ottawa As Truckers Protest
Follow us on

కెనడా(Canadian ) రాజధాని ఒట్టావాలో(Ottawa) ట్రక్ డ్రైవర్ల ఆందోళనలు(truckers protest ) మరింత ఉధృతమయ్యాయి. దీంతో దేశ రాజధానిని నిరసన కారుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు ప్రొటెస్టర్ లపై సర్కార్ ఉక్కు పాదం మోపింది. పోలీసులు రంగంలోకి దిగి బలవంతంగా గూడారాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయినా నిరసనలు విరమించకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళన కారులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. వందలాది నిరనస కారులపై పోలీసులు కేసులు పెట్టారు. 170 మందికి పైగా ప్రొటెస్టర్ లను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ట్రక్కర్లను ఎదుర్కొన్న పోలీసులు వారిని పార్లమెంట్ హిల్ వెలుపల నుంచి తరిమికొట్టారు. దీంతో పోలీసుల ఫలితం ఫలించింది. రాజధాని ఒట్టావా నగరం తిరిగి భద్రతా దళాల చేతుల్లోకి వచ్చింది. దాదాపు నెల రోజుల తర్వాత నగరం ప్రశాంతంగా కనిపించింది.

అయితే అరెస్టైన వారి బ్యాగుల్లో పొగ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో శాంతి భద్రతలకు విఘూతం కలిగే అవకాశం నిరసనకారుల నుంచి లేకపోలేదని పోలీసులు సూచించారు. నెల రోజుల పాటు చికాకు పెట్టిన ట్రక్కర్ల నిరసన, రణగొణ ధ్వనులు తప్పిపోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

చాలామంది నిరసనకారులు నగరాన్ని విడిచి వెళ్లిపోయారని చెప్పారు ఒట్టావా తాత్కాలిక పోలీస్ చీఫ్ స్టీవ్ బెల్. కానీ ఆపరేషన్ ఇంకా ముగియలేదని.. వీధులను ఆందోళనకారులు మళ్లీ ఆక్రమించుకోవడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు స్టీవ్ బెల్. వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడంతో ఫ్రీడమ్ కాన్వాయ్ పేరుతో నిరసనలు మొదలయ్యాయి.

ICC T20I Rankings: తగ్గేదేలే అంటున్న హిట్‌మ్యాన్‌ సేన.. ఆరేళ్ల తర్వాత టీమ్‌ ఇండియా ఘనత..

Viral Video: ఇలా ఎప్పుడైనా మీరు కారు టర్న్‌చేశారా.. డ్రైవర్‌ టాలెంట్‌కి సలాం కొడుతూ ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో