Viral: ఓరి దేవుడా! అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఊహించని సీన్.. దెబ్బకు హడలిపోయి అందరూ పరుగో పరుగు

|

Jan 31, 2023 | 9:48 AM

మరణించిన తర్వాత ఎవరైనా జీవించగలరా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.! శ్వాస ఆగిపోయిందని వైద్యులు చనిపోయినట్లుగా..

Viral: ఓరి దేవుడా! అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఊహించని సీన్.. దెబ్బకు హడలిపోయి అందరూ పరుగో పరుగు
Fake Funeral
Follow us on

మరణించిన తర్వాత ఎవరైనా జీవించగలరా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.! శ్వాస ఆగిపోయిందని వైద్యులు చనిపోయినట్లుగా ప్రకటించినా.. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి బ్రతకడం లాంటి అరుదైన ఘటనలు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మీరందరూ చాలానే చదివి ఉంటారు. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అంత్యక్రియల సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి నిల్చున్నాడు. దీంతో అతడి నివాళి సభకు హాజరైన వారందరూ కూడా ఒక్కసారిగా హడలిపోయి.. షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, బాల్తజార్ లెమోస్ అనే వ్యక్తి ఫేక్ డెత్ ప్లాన్ చేశాడు. తాను చనిపోయినట్లుగా నమ్మించడమే కాదు.. అందరూ నమ్మేటట్లుగా చేశాడు. ఎంతలా అంటే! అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా లెమోస్ నిజంగానే చనిపోయాడని అనుకున్నారు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉందండోయ్.. లెమోస్ ఇలా చేయడానికి వెనుక ఓ పెద్ద ప్లాన్ ఉందట.

ఇవి కూడా చదవండి

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. లెమోస్ మొదటిగా తాను హ్యాపీగా ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. ఆ మరుసటి రోజు, తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నట్లుగా.. ఇక రెండు రోజుల అనంతరం మరొక ఫోటోతో తన మరణాన్ని అందరికీ ప్రకటించాడు. దీని ద్వారా తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో.. తనవాళ్లు ఎవరు.? తాను అంటే గిట్టనివాళ్లు ఎవరు.? అనేది తెలుసుకునేందుకు లెమోస్ ఈ డ్రామాకు శ్రీకారం చుట్టాడు.

కాగా, లెమోస్ చనిపోయాడనుకుని అందరూ షాక్ అయ్యారు. అతడికి అంత్యక్రియలు నిర్వహించి.. నివాళి సభను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ వేడుక ప్రారంభమైన వెంటనే, అకస్మాత్తుగా అతడి వాయిస్ వినిపించింది. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారిగా భయపడ్డారు, కొందరైతే.. బహుశా లెమోస్ చనిపోయే ముందు అతడి వాయిస్‌ను టేప్‌లో రికార్డ్ చేసి ఉండవచ్చు అని భావించారు, అయితే లెమోస్ మాత్రం ప్రతీ ఒక్కరికీ షాక్ ఇస్తూ.. అక్కడ అందరి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇక వేడుకకు వచ్చిన వారందరూ ఒక్కసారిగా గందరగోళానికి గురి కాగా.. లెమోస్ ఇద్దరు స్నేహితులు మాత్రం అతడు తిరిగి రావడంతో చాలా సంతోషించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం