Lockdown News: కరోనా కేసుల ఉధృతి.. ఆ దేశంలో మొదలైన 20 రోజుల పూర్తిస్థాయి లాక్‌డౌన్

యూరఫ్ దేశాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో పశ్చిమ యూరఫ్ దేశాల్లో ఒక్కటైన ఆస్ట్రియాలో..

Lockdown News: కరోనా కేసుల ఉధృతి.. ఆ దేశంలో మొదలైన 20 రోజుల పూర్తిస్థాయి లాక్‌డౌన్
covid cases

Updated on: Nov 22, 2021 | 2:50 PM

Austria Lockdown News: యూరఫ్ దేశాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో పశ్చిమ యూరఫ్ దేశాల్లో ఒక్కటైన ఆస్ట్రియాలో 20 రోజుల దేశ వ్యాప్త పూర్తిస్థాయి లాక్‌డౌన్ సోమవారం ఉదయం నుంచి మొదలయ్యింది. నాలుగో వేవ్ కారణంగా ఆస్ట్రియాలో శనివారంనాడు 15,297 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం ప్రతి రోజూ 10వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో అక్కడ పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. గరిష్ఠంగా 20 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి లాక్‌డౌన్ అమలులోకి రాగా.. పది రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

20 రోజుల లాక్‌డౌన్ తర్వాత డిసెంబరు 13నాటితో దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్ ఎత్తివేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇంకా వాక్సినేట్ కాని వారికి మాత్రం లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం హెచ్చరించింది. అటు వాక్సినేషన్‌ను వేగవంతం చేసినట్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రి కార్ల్ నెహమ్మీర్ ఆదివారంనాడు మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి దేశంలోని ప్రతిఒక్కరికా వ్యాక్సిన్ తప్పనిసరి చేయనున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండెర్ ఛాలెన్‌బెర్గ్ శుక్రవారంనాడు స్పష్టంచేశారు. అయితే దీన్ని ఎలా అమలుచేయనున్నారో ఆయన వెల్లడించలేదు. పశ్చిమ యూరఫ్‌లో అతి తక్కువగా ఆస్ట్రియాలో 66 శాతం మంది మాత్రమే ఇప్పటి వరకు పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు తెలిపారు.

Also Read..

Viral Video: ఆహారాన్ని ఎలా విసిరేస్తున్నాడో చూడండి.. వైరల్ అయిన వీడియో..

AP Capital: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు.. ఆ బిల్లుపై వెనక్కి..

Loading...
Unable to load recommendations.
Follow Us