Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 44 మంది మృతి.. వందల మందికి గాయాలు

ఇండోనేషియాలో పెను భూకంపం వణికించింది. జావా ద్వీపాన్ని అల్లకల్లోలానికి గురి చేసింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు విడిచారు. అనేకమందికి గాయాలయ్యాయి.

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 44 మంది మృతి.. వందల మందికి గాయాలు
Earthquake
Follow us

|

Updated on: Nov 21, 2022 | 5:03 PM

ఇండోనేషియానును భారీ భూకంపం వణికించింది. భూప్రకంపనల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. 44 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు.  ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది. సుమారు 700 మందికి గాయాలయ్యాయి.  వేలాది ఇళ్ళు దెబ్బతిన్నాయి.  జావా సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జావాలో భూకంప తీవ్రత 5.6గా నమోదయ్యింది. సియంజురును భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం సంబంవించిన ప్రాంతాలలోని దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఇండోనేషియాలోని జావా సమీపంలో వచ్చిన  భూకంప తీవ్రత ఎలా ఉందో దిగువన విజువల్స్‌లో చూడొచ్చు.

కొద్దిరోజుల క్రితమే ఇండోనేషియాలోని బాలి ప్రావిన్స్‌లో జీ-20 సదస్సు జరిగింది. ఇప్పుడదే ఇండోనేషియా రాజధాని జకార్తాలో భూకంపం కారణంగా విధ్వంసం జరిగింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇండోనేషియాలో కీలక పట్టణాలైన జావా, సియంజురు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. వందలు కాదు.. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయినట్టు చెప్తున్నారు. దీంతో.. ఎటు చూసినా గాయపడ్డవారే కనిపిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గత ఫిభ్రవరిలో కూడా ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. అప్పుడు 6.2 తీవ్రత నమోదయ్యింది. ఇప్పుడు వచ్చింది 5.6 తీవ్రతే అయినా నగరానికి సమీపంలో రావడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..