పొరుగింట్లోని చెట్లు నరికివేత.. ఏకంగా రూ.14 కోట్ల భారీ జరిమానా విధించిన కోర్టు..!

|

Jul 02, 2023 | 5:07 PM

పక్కింట్లో చెట్లను నరికినందుకు ఓ వ్యక్తికి కోర్టు అక్షరాలా రూ.14 కోట్లు జరిమానా విధించింది. అమెరికాలో ఈ వింతఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీకి చెందిన సమీహ్ షిన్వే (40) అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న దాదాపు 32 చెట్లను పొరుగింట్లో ఉంటోన్న ఓ వ్యక్తి..

పొరుగింట్లోని చెట్లు నరికివేత.. ఏకంగా రూ.14 కోట్ల భారీ జరిమానా విధించిన కోర్టు..!
Penalty For Cutting Trees
Follow us on

వాషింగ్లన్: పక్కింట్లో చెట్లను నరికినందుకు ఓ వ్యక్తికి కోర్టు అక్షరాలా రూ.14 కోట్లు జరిమానా విధించింది. అమెరికాలో ఈ వింతఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీకి చెందిన సమీహ్ షిన్వే (40) అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న దాదాపు 32 చెట్లను పొరుగింట్లో ఉంటోన్న ఓ వ్యక్తి నరికివేయించాడు. నిందితుడు ఓ కంపెనీకి సీఈవో కావడం విశేషం. యాంటీ టెర్రరిజం కంపెనీకి చెందిన సీఈవో హెబర్‌ ఆ చెట్లన్నింటినీ నరికివేయించాడు. తన ఇంటి ముందున్న పర్వతాలు, ఆకాశం కనిపించడం లేదని, అందుకు చెట్లు అడ్డుగా ఉన్నాయన్న కారణంతో దాదాపు అర ఎకరం స్థలంలో ఉన్న ఓక్ చెట్లు, మాపుల్స్, బిర్చ్‌ చెట్లను నరికేశాడు. దీంతో సదరు చెట్ల యజమాని కోర్టు కెక్కాడు.

ఒక్కో చెట్టుకు వెయ్యి డాలర్ల చొప్పున మొత్తం 32,000 (రూ. 26,27,080) డాలర్లను కోర్డు జరిమానా విధించింది. అంటే ఒక్కో చెట్టుకు నిందితుడు రూ. 82,096 చెల్లించవల్సి ఉంటుంది. ఆ రాష్ట్ర చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా చెట్లను కొట్టివేస్తే జరిమానా విధించడం లేదా వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచడం చేయాలి. ఐతే షిన్వే తన ఇంటి ఆవరణలోని స్థలాన్ని అపరిశుభ్రం చేసినందుకు, 20 నుంచి 150 ఏళ్ల వయసున్న పురాతన చెట్లను నిరికినందుకు కూడా పరిహారం చెల్లించవల్సిందిగా డిమాండ్‌ చేశాడు. అందుకు రూ.1.2 మిలియన్ల డాలర్లు (రూ.12,31,44,375) కోరాడు.

అతని చర్య నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లను నరికివేశాడు. అవి మళ్లీ పెరగడానికి చాలా సమయం పడుతుందని షిన్వే బాధపడ్డాడు. ఇక నిందితుడు హెబర్‌ విషయానికొస్తే ఇప్పటికే కొర్టు అతనికి 12 కోట్ల జరిమాని విధించింది. ఇక చెట్లను నరకడానికి అతను చేసిన ఖర్చు మరో 4 లక్షల డాలర్లు అంటే రూ.3,28,38,500 వరకు అదనంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.