అతను పాకిస్థానీ కాని ధోని అభిమాని

పాకిస్థాన్, ఇండియా రెండూ దాయాది దేశాలు. కానీ బద్ధ శత్రువులు. ఇక క్రికెట్ విషయంలో అయితే రెండు దేశాల మధ్య గేమ్ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఆటగాళ్ల మధ్య కూడా  వైరం అదే రేంజ్‌లో ఉంటుంది. ప్లేయర్స్ మధ్యే అలా ఉంది అంటే ఇక ఫ్యాన్స్ గురించి మళ్లీ చెప్పాలా?. అయితే భారత ఆటగాడు ధోని మాత్రం వీటన్నీటికి అతీతుడు అనిపిస్తుంది. మహీ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. స్వదేశంలోనే కాదు..ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా ధోనిని విపరీతంగా ప్రేమిస్తున్నారు. పాకిస్థాన్‌లో కూడా ధోని అభిమానులు ఉన్నారంటే మీరు నమ్ముతారా?..అయితే ఆ ఫీట్‌ను సాధించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2015లో ఓ పాక్ క్రికెట్ అభిమాని… ధోనీ పేరు ఉన్న జెర్సీతో స్టేడియంలో సందడి చేశాడు. భారత జట్టు గెలిచిన తర్వాత మాహీ మీద అభిమానంతో ఇంటి ముందు భారత జెండా ఎగురవేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడు మరో ధోనీ ఫ్యాన్.
ఇదంతా గతం ఇప్పుడు వరల్డ్‌కప్‌ ప్రారంభం కాబోతున్న తరుణంలో మాహీ కోసం పాకిస్థాన్ జెర్సీని సిద్ధం చేస్తున్నారు ఆయన పాకిస్థాని ఫ్యాన్స్. జెర్సీ అంతా పాకిస్థాన్‌ జట్టును పోలినట్టే ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ మాత్రం ధోని అనే పేరుతో పాటు 7 నెంబర్ ఉంటుంది. ధోనీ పేరుతో ఉన్న పాకిస్థాన్ జెర్సీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ధోని క్రేజ్ చూసి వారెవ్వా అంటున్నారు ఇతర దేశాల ఆటగాళ్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *